గ‌ల్లా హీరో చిత్రంలో సుధీర్ హీరోయిన్‌..

  • IndiaGlitz, [Sunday,October 14 2018]

హిట్ చిత్రాల నిర్మాత‌గా పేరున్న దిల్‌రాజు వ‌రుస సినిమాల‌ను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ఒక‌వైపు స్టార్ హీరోల‌తో మల్టీస్టార‌ర్ సినిమాలు చేస్తూనే.. మ‌రో వైపు యువ క‌థానాయ‌కుల‌తో సినిమాలు చేస్తున్నారు. దిల్‌రాజు బ్యాన‌ర్‌లో లాంచ్ కాబోతున్న హీరో గ‌ల్లా అశోక్‌. పార్ల‌మెంట్ స‌భ్యుడు గ‌ల్లా జ‌య‌దేవ్ త‌న‌యుడు.. సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ మేన‌ల్లుడే గ‌ల్లా అశోక్‌.

ఈ డెబ్యూ హీరోతో శ‌శి అనే డైరెక్ట‌ర్ డెబ్యూ కానున్నాడు మ‌రి. ముందు ఈ సినిమాకు 'ఆడు మ‌గాడ్రాబుజ్జి' ద‌ర్శ‌కుడు కృష్ణారెడ్డినే ద‌ర్శ‌కుడిగా అనుకున్నా.. చివ‌ర‌కు బెట‌ర్ మెంట్ కోసం కృష్ణారెడ్డి ప్లేస్‌లో శ‌శి అనే కొత్త ద‌ర్శ‌కుడిని తీసుకున్నాడ‌ట దిల్‌రాజు. కాగా.. ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌భా న‌టేశ్ న‌టించ‌నుంది. రీసెంట్‌గా సుధీర్ బాబు హీరోగా న‌టించిన 'న‌న్నుదోచుకుందువ‌టే' చిత్రంతో మెప్పించింది. త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోయే ర‌వితేజ‌, విఐ.ఆనంద్ సినిమాలో హీరోయిన్‌గా కూడా న‌టించ‌నుంది. ఇప్పుడు గ‌ల్లా అశోక్ చిత్రంలో కూడా హీరోయిన్‌గా అవ‌కాశాన్ని అందుకుంది మ‌రి..

More News

'పందెంకోడి 2' కి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన హీరో

మాస్ హీరో విశాల్ న‌టించిన చిత్రం 'పందెంకోడి 2'. 2005లో లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన పందెంకోడి చిత్రానికి సీక్వెల్‌.

నెటిజ‌న్ల‌కు వ‌ర్మ ప‌రీక్ష‌

వివాదాల‌తో ఎప్పుడూ వార్త‌ల్లో వ్య‌క్తిగా ఉండే వ‌ర్మ‌.. నేడు ట్విట్ట‌ర్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.

హిందీలోకి నిత్యామీన‌న్‌

ప్ర‌స్తుతం నిత్యామీన‌న్ 'ప్రాణ' అనే సినిమాతో బిజీ బిజీగా ఉన్నారు. ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో నిత్యామీన‌న్ ర‌చ‌యిత‌గా క‌న‌ప‌డ‌బోతున్నారు.

ప్రేక్షకుడు ఫస్ట్‌ లుక్‌

నూతన నటీనటులను తెలుగుతెరకు పరిచయం చేస్తూ రేఖ సాయిలీల ప్రొడక్షన్స్‌ పతాకంపై పిల్లా రాజా నిర్మిస్తున్న చిత్రం 'ప్రేక్షకుడు'.

పూరి జగన్నాధ్ చేతుల మీదుగా 'వినరా సోదర వీరకుమారా!' ఫస్ట్ లుక్ విడుదల

శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్లుగా లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకంపై సతీష్ చంద్ర నాదెళ్ళ దర్శకత్వంలో లక్ష్మణ్ క్యాదరి నిర్మిస్తున్న చిత్రం 'వినరా సోదర వీరకుమారా!'