మే 26న హీరో సుధీర్‌ బాబు ప్రొడ‌క్ష‌న్స్ లోగో ఆవిష్క‌ర‌ణ‌

  • IndiaGlitz, [Wednesday,May 23 2018]

ప్రేమ‌ క‌థా చిత్రం , భ‌లే మంచి రోజు, కృష్ణ‌మ్మ‌ క‌లిపింది ఇద్ద‌రిని లాంటి విభిన్న ప్రేమ‌ క‌థా చిత్రాల్లో న‌టించి మెప్పించడమే కాకుండా బాలీవుడ్ లో భాగీ లాంటి భారీ చిత్రంలో న‌టించిన‌ హీరో సుధీర్ బాబు నిర్మాత‌గా మారి సుధీర్‌బాబు ప్రొడ‌క్ష‌న్స్ పేరుతో బ్యాన‌ర్ ని స్టార్ట్‌ చేసారు. మే 26న సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఈ ప్రొడ‌క్ష‌న్ లోగోని వైభ‌వంగా ప్రారంభిస్తున్నారు.

తెలుగు సినిమా ఇండస్ట్రిలో త‌న‌కంటూ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుని హ్యాండ్ స‌మ్ రొమాంటిక్ హీరో ఇమేజ్ తో కెరీర్ ని ముందుకు కొన‌సాగిస్తున్న సుధీర్‌బాబు నిర్మాత గా మారి వ‌రుస చిత్రాలు చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ప్రొడ‌క్ష‌న్ నెం1 గా ఓ చిత్రం ప్రారంభించి దాదాపు 80 శాతం కంప్లీట్ చేశారు.

ప్ర‌స్తుతం మోస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం గా వస్తున్న స‌మ్మెహ‌నం విడుద‌ల కి సిద్దంగా వుంది. అలానే మ‌రో విభిన్న క‌ధతో సిద్ద‌మ‌వుతున్న వీర‌భోగ‌వ‌సంత రాయులు అనే చిత్రం కూడా షూటింగ్ చివ‌రి భాగంలో వుంది. ఇదిలా వుండ‌గా అగ‌ష్టు నుండి పుల్లెల గోపిచంద్ బ‌యోపిక్ షూటింగ్ తో బిజీ అవుతారు.. ఓ ప‌క్క హీరోగా బిజీగా వుంటూనే మ‌రో ప‌క్క ప్రోడ‌క్ష‌న్ ప్రారంభిచ‌టం విశేషం..

More News

జూన్‌ 29న సాయిధరమ్‌తేజ్‌-కరుణాకరన్‌ 'తేజ్‌ ఐ లవ్‌ యు'

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వం.

ఏదైనా ఒక‌టి సంక్రాంతికే అంటున్న‌ చరణ్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

తమిళ రీమేక్ గురించి క్లారిటీ ఇచ్చిన రవితేజ

విజయ్, సమంత జంటగా నటించిన తమిళ  చిత్రం 'తెరి'. 2016లో వచ్చిన ఈ చిత్రం తమిళనాట ఘన విజయం సాధించింది. ఈ సినిమాని తెలుగులో కూడా 'పోలీస్‌' పేరుతో అనువదించారు.

'సమ్మోహనం' కోసం 74 ఏళ్ళ వయసులో ఫుల్ రొమాంటిక్ సాంగ్ రాసిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ 

సుధీర్ బాబు, అదితీ రావ్ హైదరి జంటగా మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ''సమ్మోహనం'' చిత్రం జూన్ 15న విడుదలకు ముస్తాబవుతోంది.

జూన్ 1న 'వైఫ్ ఆఫ్ రామ్' ట్రైలర్

కెరియ‌ర్ బిగినింగ్ నుండి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు ను సంపాదించుకున్న మంచు ల‌క్ష్మి ఈసారి ధీక్ష గా ప్రేక్ష‌కుల‌కు స‌ర్ ప్రైజ్ చేయ‌బోతుంది.