close
Choose your channels

కారును తోసి ఫిట్‌నెస్ పెంచుకున్న సుధీర్ బాబు

Saturday, September 14, 2019 • తెలుగు Comments

కారును తోసి ఫిట్‌నెస్ పెంచుకున్న సుధీర్ బాబు

హీరోలందు నేను వేర‌యా! అనే త‌ర‌హాలో సుధీర్‌బాబు చేసిన ప్ర‌య‌త్నం ఈరోజు అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ త‌రం క‌థానాయ‌కులు క‌థ‌, క‌థ‌నాల మీద‌నే కాదు.. ఫిజిక్ మీద కూడా ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ పెడుతున్నారు. జిమ్‌లో గంట‌లు గంట‌లు క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇలా జిమ్‌లో గంట‌లు పాటు క‌ష్ట‌ప‌డి శ‌రీరాన్ని మ‌లుచుకునే హీరోల్లో సుధీర్ బాబు ఒక‌రు. ఈయ‌న సాధారణంగా సినిమాల్లోకి రాక ముందు బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఇక్క‌డే త‌న ఫోక‌స్‌ను పెట్టారు. ఈయ‌న ఫిట్‌నెస్ విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త‌గా ఉంటారు. 

అయితే సాధార‌ణంగా జిమ్‌లో గంట‌ల పాటు స‌మయాన్ని వెచ్చించే సుధీర్ ఈసారి భిన్నంగా ఆలోచించాడు. కోచ్ చెప్పిన‌ట్లు రెగ్యుల‌ర్ జిమ్ కాకుండా త‌న‌కారును తానే తోసుకుంటూ శ‌రీరానికి వ్యాయమాన్ని ఇచ్చాడు. ఈ వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన సుధీర్ బాబు తాను `వి` సినిమా కోసం సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలిపారు.

`వి` చిత్రంలో నాని విల‌న్‌గా న‌టిస్తుంటే.. సుధీర్‌బాబు పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మ‌రో ప‌క్క బ్యాడ్మింట‌న్ కోచ్ పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్‌లో కూడా సుధీర్ బాబున‌టించాల్సి ఉంది. ఈ సినిమాలో అదితిరావు హైద‌రి, నివేదా థామ‌స్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz