కారును తోసి ఫిట్‌నెస్ పెంచుకున్న సుధీర్ బాబు

  • IndiaGlitz, [Saturday,September 14 2019]

హీరోలందు నేను వేర‌యా! అనే త‌ర‌హాలో సుధీర్‌బాబు చేసిన ప్ర‌య‌త్నం ఈరోజు అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ త‌రం క‌థానాయ‌కులు క‌థ‌, క‌థ‌నాల మీద‌నే కాదు.. ఫిజిక్ మీద కూడా ప్ర‌త్యేక‌మైన శ్ర‌ద్ధ పెడుతున్నారు. జిమ్‌లో గంట‌లు గంట‌లు క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇలా జిమ్‌లో గంట‌లు పాటు క‌ష్ట‌ప‌డి శ‌రీరాన్ని మ‌లుచుకునే హీరోల్లో సుధీర్ బాబు ఒక‌రు. ఈయ‌న సాధారణంగా సినిమాల్లోకి రాక ముందు బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత ఇక్క‌డే త‌న ఫోక‌స్‌ను పెట్టారు. ఈయ‌న ఫిట్‌నెస్ విష‌యంలో ఎంతో జాగ్ర‌త్త‌గా ఉంటారు.

అయితే సాధార‌ణంగా జిమ్‌లో గంట‌ల పాటు స‌మయాన్ని వెచ్చించే సుధీర్ ఈసారి భిన్నంగా ఆలోచించాడు. కోచ్ చెప్పిన‌ట్లు రెగ్యుల‌ర్ జిమ్ కాకుండా త‌న‌కారును తానే తోసుకుంటూ శ‌రీరానికి వ్యాయమాన్ని ఇచ్చాడు. ఈ వీడియోను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసిన సుధీర్ బాబు తాను 'వి' సినిమా కోసం సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలిపారు.

'వి' చిత్రంలో నాని విల‌న్‌గా న‌టిస్తుంటే.. సుధీర్‌బాబు పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. మ‌రో ప‌క్క బ్యాడ్మింట‌న్ కోచ్ పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్‌లో కూడా సుధీర్ బాబున‌టించాల్సి ఉంది. ఈ సినిమాలో అదితిరావు హైద‌రి, నివేదా థామ‌స్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

More News

క‌న్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక‌

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఇమేజ్ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ న‌టిగా కూడా మంచి పేరు సంపాదించుకుంది.

'బందోబస్త్' కంప్లీట్ ఆల్ రౌండ్ ఎంటర్ టైనర్ - ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూర్య

ప్రతి చిత్రంలోనూ పాత్ర పరంగా నటనలోనూ, ఆహార్యంలోనూ వైవిధ్యం కనబరిచే కథానాయకుల్లో సూర్య ఒకరు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు డా. రాజశేఖర్ రూ. 10 లక్షల విరాళం

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు గడించింది. ఎన్నికల సందర్భంగా

షకీలా సమర్పణ లో 'లేడీస్ నాట్ ఎలౌడ్'

సెన్సెషనల్ స్టార్ షకీలా  సమర్పణలో సాయిరామ్ దాసరి దర్శకత్వం లో తెరకెక్కుతోన్న చిత్రం "లేడీస్ నాట్ ఎలౌడ్" .

సినీ ప్రముఖుల చేతుల మీదుగా 'ప్రేమ పిపాసి' మోషన్ పోస్టర్ లాంచ్

ఎస్ఎస్ ఆర్ట్  ప్రొడ‌క్ష‌న్స్  పతాకం పై  రాహుల్ బాయ్ మీడియా అండ్ దుర్గ‌శ్రీ ఫిలింస్ తో కలిసి పి.ఎస్.రామ‌కృష్ణ(ఆర్‌.కె) నిర్మిస్తోన్న చిత్రం  `ప్రేమ పిపాసి`