'మ‌నం' ర‌చ‌యిత‌తో సుధీర్‌బాబు?

  • IndiaGlitz, [Monday,October 30 2017]

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ప‌లు చిత్రాల్లో సంద‌డి చేసిన హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌.. గుండెజారి గ‌ల్లంతయ్యిందే, మ‌నం చిత్రాల‌తో మాట‌ల ర‌చ‌యిత‌గా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న హ‌ర్ష‌.. ఆ సినిమా త‌రువాత యువ క‌థానాయ‌కుడు సుధీర్ బాబుతో ఓ సినిమా చేయ‌బోతున్నాడంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్రేమ‌క‌థా చిత్ర‌మ్ త‌రువాత స‌రైన విజ‌యం లేని సుధీర్ బాబు.. ఇటీవ‌లే శ‌మంత‌క‌మ‌ణి చిత్రంతో ప‌ల‌క‌రించాడు.

అతి త్వ‌ర‌లో ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమా త‌రువాతే హ‌ర్ష‌వ‌ర్థ‌న్ చిత్రాన్ని సుధీర్ ప‌ట్టాలెక్కించ‌నున్నాడ‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. హ‌ర్ష‌వ‌ర్థ‌న్ చెప్పిన పాయింట్ సుధీర్‌కి బాగా న‌చ్చింద‌ని.. ఆయ‌న నెరేష‌న్ స్టైల్ కూడా న‌చ్చి సినిమాకి వెంట‌నే ఓకే చెప్పార‌ని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. గుడ్ బ్యాడ్ అగ్లీ ని వ‌చ్చే నెల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. మాట‌ల ర‌చ‌యిత‌గా స‌క్సెస్ అయిన హ‌ర్ష‌.. ద‌ర్శ‌కుడిగానూ మార్కులు సంపాదిస్తాడేమో చూడాలి.

More News

'ప్రెసిడెంటుగారి పెళ్ళాం'కి 25 ఏళ్లు

కింగ్ నాగార్జున‌కి కెరీర్ ఆరంభంలో.. మాస్‌లో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చిన చిత్రం ప్రెసిడెంటుగారి పెళ్లాం. సెన్సేష‌న‌ల్ హిట్ మూవీ శివ‌ త‌రువాత స‌రైన విజ‌యం లేని నాగ్‌కి.. ఆ లోటుని తీర్చింది ఈ సినిమా.

సీనియ‌ర్ నిర్మాత క‌న్నుమూత‌...

సీనియ‌ర్ నిర్మాత అట్లూరి పూర్ణ చంద్ర‌రావు(92)ఈరోజు అనారోగ్యంతో మేడ్చల్‌ జిల్లా కాప్రా మండలం కమలానగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు.

ఇద్ద‌రూ బాలీవుడ్ విల‌నీలే...

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌కు ఇప్పుడున్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఏ సౌతిండియ‌న్ స్టార్‌కు లేనంత ఇమేజ్ ఆయ‌న సొంతం.

'2.0' మ‌ళ్లీ వాయిదా?

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, డైరక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సైంటిఫిక‌ల్ థ్రిల్ల‌ర్ '2.0'. 450 కోట్ల బ‌డ్జెట్‌తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.

సూర్య క్రేజీ కాంబో....

సింగం 3 త‌ర్వాత హీరో సూర్య విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తానా సెంద‌కూట్ట‌మ్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసినిమా త‌ర్వాత సూర్య చేయ‌బోయే సినిమా పలు వార్త‌లు వ‌చ్చాయి.