close
Choose your channels

స్టూడియో నిర్మాణానికి సుధీర్ ఆస‌క్తి!!

Wednesday, July 29, 2020 • తెలుగు Comments

స్టూడియో నిర్మాణానికి సుధీర్ ఆస‌క్తి!!

‘ఎస్.ఎం.ఎస్’ చిత్రంతో హీరోగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన సుధీర్ బాబు కొన్ని చిత్రాల్లో చిన్నా చిత‌కా పాత్ర‌ల‌తో పాటు ‘భాగి’ వంటి చిత్రంలో విల‌న్‌గా కూడా న‌టించారు. ప్ర‌స్తుతం ఈయ‌న నాని 25వ చిత్రం ‘వి’లో ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. క‌రోనా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డి థియేట‌ర్స్ ఓపెన్ అయిన త‌ర్వాత ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. అయితే త‌దుప‌రి సుధీర్‌బాబు ఏ సినిమాలో న‌టిస్తాడ‌నే దానిపై క్లారిటీ లేదు. ప్ర‌స్తుతం సుధీర్ బాబు మాత్రం క‌థ‌ల‌ను వింటున్నార‌ట‌.

సాధార‌ణంగానే ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన సుధీర్ బాబు లాక్‌డౌన్ స‌మ‌యంలో ఫిట్‌నెస్‌పై మ‌రింత ఫోక‌స్ పెట్టారు. అలాగే మిగ‌తా స‌మ‌యాన్ని కుటుంమంతో స‌ర‌దాగా గ‌డుపుతున్నారు. ఈయ‌న హీరోగానే కాకుండా న‌న్నుదోచుకుందువ‌టే చిత్రంతో నిర్మాత‌గా కూడా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో కొత్త అడుగు వేయ‌బోతున్నార‌ట సుధీర్ ఇంత‌కూ అదేంటంటే .. స్టూడియో అధినేత‌గా మారాల‌నుకుంటున్నార‌ట‌. స్టూడియో నిర్మాణానికి మంచి ప్రాంతాన్ని చూస్తున్నాన‌ని, మంచి ప్లేస్ దొర‌క్క‌గానే షూటింగ్‌ల కోసం ఓ స్టూడియో నిర్మిస్తాన‌ని రీసెంట్ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. మ‌రి సుధీర్ స్టూడియో నిర్మాణ కోరిక తీర‌డానికి ఇంకెంత స‌మ‌యం ప‌డుతుందో చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz