close
Choose your channels

నా కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమా..‘రణరంగం-2’ కూడా: సుధీర్ వర్మ

Tuesday, August 13, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నా కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమా..‘రణరంగం-2’ కూడా: సుధీర్ వర్మ

హీరో శర్వానంద్, కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్‌ నటీనటులుగా సుధీర్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘రణరంగం’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ట్రైలర్‌ను బట్టి చూస్తే అంచానాలు భారీగానే పెరిగిపోయాయి. కాగా ఆగస్టు 15న విడుదల కానుండటంతో పెద్దఎత్తున ప్రమోషన్స్ చేస్తోంది చిత్రబృందం. ఇప్పటికే కల్యాణి ప్రియదర్శిన్ మీడియాతో ముచ్చటించగా.. తాజాగా.. ఈ చిత్ర దర్శకుడు సుధీర్ వర్మ.. సినిమాకు సంబంధించి, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుల వివరాలను నిశితంగా వివరించారు.

‘రణరంగం’ ఎందుకు తీయాల్సి వచ్చింది..!?

‘రణరంగం’కు ప్రేరణ అంటే ‘గాడ్ ఫాదర్ 2’ మూవీ స్క్రీన్ ప్లే నుండి ప్రేరణ పొందడం తీసుకున్నాను. వాస్తవానికి ‘గ్యాంగ్ స్టర్’ మూవీ తీసే ఎవరికైనా గాడ్ ఫాదర్ మూవీనే ఓ ప్రేరణ అని చెప్పుకోవచ్చు. అందరిలాగే తాము కూడా ఆ స్క్రీన్ ప్లే నుంచే స్పూర్తి పొంది రాసుకున్నాం. మేం ఎంతబాగా స్క్రీన్ ప్లే చేశామనేది.. మూవీ ఫలితం తరువాత తెలుస్తుంది. శర్వానే ఎంచుకోవడం వెనుక కారణాలున్నాయి. శర్వా చిత్రాలలో నాకు ‘ప్రస్థానం’ బాగా ఇష్టం. శర్వాతో చిత్రం చేస్తే ఫ్యామిలీ, లవ్ కాకుండా కొంచెం సీరియస్ జోనర్‌లో ఉన్న మూవీ చేయాలనుకున్నాను. అందుకే ‘రణరంగం’తో మీ ముందుకు వస్తున్నాము. ‘స్వామిరారా’ సినిమా విడుదల తర్వాతే చిన్నబాబుగారు పిలిచి అడ్వాన్స్ ఇచ్చారు. కొన్ని అనివార్యకారణాల కారణాల వల్ల చేయలేకపోయాను. ఇప్పుడు అదే సితార బ్యానర్‌లో సినిమా చేయడం చాలా ఆనందాన్నిచ్చింది.

నా కేరీర్‌లోనే భారీ బడ్జెట్!

ఈ చిత్రానికి అనుకున్న దానికంటే ఎక్కవ బడ్జెట్‌ను పెట్టారన్న దానిపై సుధీర్ మాట్లాడుతూ.. నిర్మాత నాగవంశీకి సినిమా అవుట్ ఫుట్ ముఖ్యం. ఎక్కడా క్వాలిటీ తగ్గుకుండా సినిమా చేయమని నాకు చెప్పారు. ఆ క్రమంలో ముందు అనుకున్నదాని కంటే బడ్జెట్ పెరిగింది. నా కెరీర్‌‌లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమా. వాస్తవానికి ఇప్పటివరకూ నాగవంశీ నాకు బడ్జెట్ ఎంత అవుతుందో చెప్పలేదు. ఆయనకి బడ్జెట్ కంటే కూడా సినిమా క్వాలిటీ మాత్రమే ముఖ్యం.. డబ్బుల విషయంలో ఆయన ఎక్కడా రాజీపడరు.. సినిమా క్వాలిటీనే ఆయన కోరుకుంటారు.

శర్వానంద్ నటన.. సీక్వెల్ గురించి!!

శర్వానంద్ అచ్చం ‘గ్యాంగ్‌స్టర్’ లాగే కనిపించి అందర్నీ మెప్పిస్తాడు. పాత్రను ఓన్ చేసుకుని శర్వా చేశాడు. ‘రణరంగం’లోని శర్వా క్యారెక్టర్‌లో రెండు షేడ్స్ ఉంటాయి. ఆ రెండు షేడ్స్ ను ఆయన బాగా పలికించారు. ‘రణరంగం’కి సీక్వెల్ చేసే ఆలోచన అయితే ఉంది. ఈ మధ్యనే శర్వానంద్ ఓ ఐడియా చెప్పారు. అది నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే సీక్వెల్ రావాలంటే ‘రణరంగం’ సినిమా ముందు సక్సెస్ కావాలి. సక్సెస్ అయితే స్వీక్వెల్‌ చేసే అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ సినిమా రిలీజ్ తర్వాతే సీక్వెల్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సితార బ్యానర్‌ లోనే నా తదుపరి సినిమా ఉంటుంది. రణరంగం చేస్తున్నప్పుడే నాగవంశీగారు మరో సినిమా చేయమని అడిగారు. ప్రస్తుతానికి అయితే ‘రణరంగం’ సినిమా రిలీజ్ కోసమే ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ‘రణరంగం’ అందరికీ నచ్చుతుందని నేను భావిస్తున్నాను అని సుధీర్ వర్మ మీడియాకు వివరించారు. అయితే పంద్రాగస్టు నాడు రణరంగంలోకి దిగితే ఏ మాత్రం కలెక్షన్లు కురుస్తుందో..? సినిమా ఏ మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంటుందే వేచి చూడాలి మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.