కుమారుడికి సాయం చేయాల్సిందిగా కోరిన సుహాసిని

  • IndiaGlitz, [Monday,August 28 2017]

దర్శ‌కుడు మ‌ణిర‌త్నం, న‌టి సుహాసినిల కుమారుడు నంద‌న్ ఇట‌లోని వెన్నిస్‌లో దోపిడీకి గుర‌య్యాడు. ఈ విష‌యాన్ని త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌జేయ‌గానే వెంట‌నే సుహాసిని ట్విట్ట‌ర్ ద్వారా ఎవ‌రైనా వెన్నిస్ ఎయిర్‌పోర్టు ద‌గ్గ‌ర‌లో ఉంటే త‌న కుమారుడికి స‌హాయం చేయాల్సిందిగా కోరింది. అలాగే త‌న కుమారుడి ఫోన్‌కు ఎవ‌రు ఫోన్ చేయ‌వ‌ద్ద‌ని ఎందుకంటే లో బ్యాట‌రీలో ఉండ‌టం కారణంగా అతనితో కాంటాక్ట్ కోల్పోయే ప్ర‌మాదం ఏర్ప‌డింది. అయితే కొద్దిసేప‌టికే నంద‌న్ ఎయిర్ పోర్టు స‌మీపంలోని హోట‌ల్‌లో దిగాడ‌ని, ఇన్‌ఫ‌ర్మేష‌న్ రావ‌డంతో సుహాసిని త‌న కుమారుడికి స‌హాయం చేసిన వారంద‌రికీ థాంక్స్ చెప్పింది.

More News

గోపీచంద్ 'ఆక్సిజన్' రిలీజ్ డేట్

గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "ఆక్సిజన్" పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఏమాన్యూల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు.

'యుద్ధం శరణం' పాటల విడుదల

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం బ్యానర్పై కృష్ణ ఆర్.వి.మారి ముత్తు దర్శకత్వంలో రజని కొర్రపాటి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'యుద్ధం శరణం'.

లారెన్స్ తో కాజల్..?

డ్యాన్సర్గా, కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా తనదైన శైళిలో రాణిస్తున్నాడు రాఘవేంద్ర లారెన్స్. ముని సీక్వెల్స్తో సక్సెస్ఫుల్ దర్శకుడిగా లారెన్స్ వరుస విజయాలను అందుకుంటున్నాడు. ముని, కాంచన (ముని2), గంగ (ముని3)సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టాయి.

మ్యూజికల్ హిట్ 'శీను'కి 18 ఏళ్లు

'బిచ్చగాడు' వంటి సంచలన విజయం సాధించిన చిత్రాన్ని రూపొందించి వార్తల్లోకి ఎక్కిన దర్శకుడు శశి.. తెలుగులో చాన్నాళ్ల క్రితమే ఓ సినిమాని రూపొందించాడు. అదే శీను. తమిళంలో శశినే రూపొందించిన సొల్లామలే చిత్రానికి రీమేక్ వెర్షన్ ఇది.

20లోకి మెగాస్టార్ 'చూడాలని ఉంది'

'హిట్లర్'తో సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టిన మెగాస్టార్ చిరంజీవి.. మరో రెండు సినిమాల తరువాత ఇండస్ట్రీ హిట్ ఇచ్చి అప్పట్లో సంచలనం సృష్టించాడు. అలా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఆ చిత్రమే 'చూడాలని ఉంది'.