‘పుష్ప‌’.. సుక్కు మ‌రో ప్లాన్‌!!

  • IndiaGlitz, [Monday,August 24 2020]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న చిత్రం ‘పుష్ప’. పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడో వెళ్లాల్సింది. కానీ.. క‌రోనా కార‌ణంగా ఆగింది. ప్ర‌భుత్వం 40-50 మంది చిత్రీక‌ర‌ణ చేసుకోవ‌చ్చున‌ని చెప్పిన‌ప్ప‌టికీ అంత త‌క్కువ మందితో అయితే ఈ సినిమాను చిత్రీక‌రించలేమ‌ని చిత్ర యూనిట్ ఇంకా సినిమా షూటింగే స్టార్ట్ చేయ‌లేదు. ఇప్పుడిప్పుడే మేక‌ర్స్‌, స్టార్స్ అంద‌రూ నెమ్మ‌దిగా షూటింగ్స్‌ను స్టార్ట్ చేస్తున్నారు. ఈ క‌మ్రంలో బ‌న్నీ, సుక్కు అండ్ టీమ్ ‘పుష్ప‌’ షూటింగ్‌ను స్టార్ట్ చేయాల‌నుకుంటుందట..

నిజానికి ఈ సినిమా షూటింగ్‌ను కేర‌ళ అడ‌వుల్లో చిత్రీక‌రించాల‌నుకున్నారు. అల్లు అర్జున్ లేకుండా కొన్ని స‌న్నివేశాల‌ను కూడా చిత్రీక‌రించారు. అయితే ఈలోపు క‌రోనా వైర‌స్ ప్ర‌భావం ప్రారంభం కావ‌డంతో యూనిట్ వెన‌క్కి వ‌చ్చేసింది. ఇప్పుడు ‘పుష్ప‌’ యూనిట్ కేర‌ళ వెళ్లే ఆలోచన చేయ‌డం లేదు. ముందుగా ఉభ‌యగోదావ‌రి జిల్లాల స‌మీపంలో అడ‌వుల్లో చిత్రీక‌రించాల‌నుకున్నా. వ‌ద్ద‌నుకున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ప‌రిస‌ర ప్రాంతాల్లోని అడ‌వుల్లో చిత్రీక‌ర‌ణ జ‌రిపేలా మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. సుక్కు అండ్ టీమ్ ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టార‌ని స‌మాచారం.

More News

ఇన్‌టెన్స్ థ్రిల్ల‌ర్‌గా సుమంత్ క‌ప‌టధారి.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

మళ్ళీరావా, సుబ్రహ్మణ్యపురం, ఇదంజ‌గ‌త్ .. ఇలా వ‌రుస హిట్ చిత్రాల‌తో హీరో సుమంత్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు.

ద‌స‌రాకి చిరు మ‌రో స్పెష‌ల్!!

తన పుట్టిన‌రోజు(ఆగ‌స్ట్ 22) సంద‌ర్భంగా త‌న 152వ చిత్రం ‘ఆచార్య‌’ సినిమా టైటిల్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

త్రివిక్ర‌మ్ టైటిల్ మారుస్తాడా?

కరోనా ప్రభావంతో ఏర్ప‌డ్డ లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్స్ బంద్ కావ‌డం.. షూటింగ్స్ ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి.

ఎన్టీఆర్ లుక్‌పై ద‌ర్శ‌క‌ధీరుడి క్లారిటీ!!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’.

మెగాఫోన్ ఆలోచ‌న‌లో క‌లెక్ష‌న్ కింగ్‌

క‌లెక్షన్ కింగ్ మోహ‌న్‌బాబు తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయం అక్క‌ర్లేని పేరు. 560పైగా చిత్రాల్లో న‌టుడిగా రాణించారు.