జూలైలో దర్శకుడు

  • IndiaGlitz, [Monday,June 05 2017]

కుమారి 21 ఎఫ్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన సొంత సంస్థలో నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ ప్రేమకు, తపనకు మధ్య నలిగిపోయే ఓ దర్శకుడి ప్రేమకథ ఇది. స్వార్థపరుడైన దర్శకుడు ప్రేమలో పడితే ఏం జరుగుతుందనే సినిమాలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇటీవల ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదలైన టీజర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది.
అశోక్ నటన, హరి ప్రసాద్ జక్కా దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జూలైలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు. అశోక్, ఇషా,పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ అనుమోలు, ఎడిటింగ్: నవీన్‌నూలి, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కోలా.

More News

నందమూరి కళ్యాణ్ రామ్ - కాజల్ అగర్వాల్ ల నూతన చిత్రం 'MLA' ప్రారంభం

నందమూరి కళ్యాణ్రామ్ కథానాయకుడిగా,నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం లో రాబోతోన్న ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ 'MLA'. "మంచి లక్షణాలు ఉన్న అబ్బాయ్" అనేది కాప్షన్. ఈ చిత్రం లో అందాల భామ కాజల్ హీరోయిన్ గా కనిపించనున్నారు.

'ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్' సక్సెస్ మీట్

వంశీ వంటి లెజెండ్రీ డైరెక్టర్తో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన నేటి తరం వారికి పోటీగా ఉన్నారు. ఆయనతో పోటీ పడుతూ పనిచేయడానికి అందరూ చాలా కష్టపడాల్సి వచ్చింది.

'లవ్లీ' కంటే 'వైశాఖం' పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను - సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్

ఒక చిన్న సినిమా టీజర్ కి 2.5 మిలియన్ వ్యూస్ రావడమనేది మామూలు విషయం కాదు.'వైశాఖం' అనే మంచి తెలుగు టైటిల్ తో డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి.దర్శకత్వంలో ఆర్.జె.సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు నిర్మించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయనే దానికి యూ ట్యూబ్లో వచ్చిన వ్యూసే నిదర్శనం.

విలక్షణ పాత్రలతో మెప్పిస్తున్న పూజాకుమార్...

న్యూక్లియర్ సైన్స్ చదువుకున్న గృహిణి పాత్రలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో విశ్వరూపంలో

'విఐపి2' టీజర్ రిలీజ్ డేట్

ధనుష్ హీరోగా సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో కలైపులి థాను వి.ఐ.పి2 చిత్రాన్ని