సుకుమార్‌.. ముచ్చ‌ట‌గా మూడోసారి

  • IndiaGlitz, [Thursday,April 12 2018]

'రంగ‌స్థ‌లం'తో కెరీర్ బెస్ట్ హిట్ సొంతం చేసుకున్నారు బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్‌. ఈ వేస‌వి ప్రారంభంలో విడుద‌లైన ఈ సినిమా.. విడుద‌ల అన్ని చోట్ల వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తోంది. ఈ సినిమా అనే కాదు.. వేస‌విలో విడుద‌లైన ప్ర‌తీ సినిమా సుకుమార్‌కు సాలిడ్ హిట్ ఇస్తోంది. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. సుకుమార్ పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చే సినిమా ‘ఆర్య’. వన్ సైడ్ లవ్ అనే కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం వేసవి కానుకగా మే 7, 2004న విడుదలై.. బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

అలాగే.. 2011లో నాగ చైతన్య, తమన్నా హీరోహీరోయిన్‌లుగా ‘100% లవ్’ ను తెరకెక్కించారు సుకుమార్. చదువు నేపథ్యంలో సాగే ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మే 6, 2011న విడుదలై ఘన విజయం సాధించింది. క‌ట్ చేస్తే.. ఈ వేస‌వికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా  న‌టించిన ‘రంగస్థలం’తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పొలిటిక‌ల్ రివేంజ్ డ్రామా మార్చి 30న విడుదలై ఘ‌న‌విజ‌యం సాధించింది. మొత్తానికి.. సుకుమార్‌కు వేస‌వి సీజ‌న్ భ‌లేగా క‌లిసొస్తుంద‌నే చెప్పాలి.

More News

మా అసోసియేషన్ వారి వలన శ్రీరెడ్డి సమస్యకు పరిష్కారం దొరకదు : కేతిరెడ్డి

మహిళల పై సినీరంగంలో, కాల్ సెంటర్లో ప్రభుత్వ కార్యాలయాలలో,లైంగిక వేధింపులు ఈ దేశంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయని,తమకు జరిగిన అన్నాయం ను ముందుకు వచ్చి చైపే మహిళల్ని

'మెర్కురి' గొప్ప సినిమా గా నిలుస్తుంది.. - సందీప్ రెడ్డి వంగ

ప్రభుదేవా ప్రధాన పాత్రలో పెన్‌ స్టూడియోస్‌, స్టోన్‌ బెంచ్‌ ఫిలింస్‌ సమర్పణలో.. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో కార్తీకేయన్‌ సంతానం, జయంతి లాల్‌ నిర్మించిన సైలెంట్‌ చిత్రం 'మెర్కురి'.

'ఆచారి అమెరికా యాత్ర' ఏప్రిల్ 27న విడుదల

విష్ణు మంచు హీరోగా నటించిన 'ఆచారి అమెరికా యాత్ర' చిత్రం ఏప్రిల్ 27న విడుదల కానుంది.

ఆ నిర్మాత‌ తో ర‌వితేజ మూడు చిత్రాల డీల్‌?

రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకుని.. 'రాజా ది గ్రేట్'తో మ‌ళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేశారు మాస్ మహారాజా రవితేజ. ఈ సినిమా ఇచ్చిన విజయంతో ఇప్పుడు వరుస చిత్రాలు చేస్తున్నారు.

ప్ర‌భాస్ బాట‌లోనే సాయిధ‌ర‌మ్ కూడా వెళ‌తాడా?

సాయి ధరమ్ తేజ్ హీరోగా, యూత్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఎ.కరుణాకరన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.