సుకుమార్ చేతుల మీదుగా 'రాజావారు రాణిగారు' ట్రైలర్ విడుదల

  • IndiaGlitz, [Tuesday,November 19 2019]

కిరణ్‌ అబ్బవరం, రహస్య గోరఖ్‌ జంటగా నటించిన చిత్రం ' రాజావారు రాణిగారు. ఎస్ ఎల్ ఎంటర్టైన్మెంట్స్, మీడియా9 పతాకంపై మనోవికాస్ డీ, మీడియా9 మనోజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం రాజావారు రాణిగారు. కంటెంట్ ఉన్న సినిమాలకి కేరాఫ్ ఆఫ్ అడ్రస్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నవంబర్ 29న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు. సందీప్ కిషన్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసి టీమ్ ని విష్ చేశారు. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తుండగా జయ్ క్రిష్ సంగీతం అందించారు.

ఈ సందర్భంగా...

సుకుమార్ మాట్లాడుతూ... ఈ టీజర్ చూడగానే కాల్ చేశాను. కుర్రాడి వయసు 25 ఇయర్స్ కూడా ఉండవు. ఫస్ట్ టైం డైరెక్టర్ కి మ్యూజిక్ మీద విజువల్స్ మీద కమాండ్ ఉండడం చాలా గొప్పగా అనిపించింది. అందరూ కుర్రాళ్ళు బాగా కష్టపడ్డారు. ఎవ్వరికీ ఎక్సపీరియెన్స్ లేదు. ఆర్య టీమ్ లో ఉన్న అందరూ దాదాపుగా డైరెక్టర్స్ అయ్యారు. కథ చెప్పడంలో ఎంత క్లారిటీగా ఉన్నారో ట్రైలర్ కూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్న. డైరెక్టర్ కి మంచి భవిష్యత్ ఉంది. పెద్ద డైరెక్టర్ అవుతాడు. మ్యూజిక్ చాలా బాగుంది. కెమెరా వర్క్ చాలా బాగుంది. హీరో హీరోయిన్ నిర్మాతలకు అల్ ఠె బెస్ట్. కిట్ట య్య నా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. టోటల్ టీం కి ఆల్ ద బెస్ట్

చిత్ర దర్శకుడు రవికిరణ్‌ కోలా మాట్లాడుతూ.. పల్లెటూరిలో పుట్టి పెరిగిన వాళ్ళకు తమ జ్ఞాపకాల్ని గుర్తు చేసే చిత్రమిది. పట్నంలో ఉన్నవాళ్లకు పల్లెటూరు ఎలా వుంటుందో రెండుగంటల్లో కళ్ళకు కట్టిన్లు ఆవిష్కరించే చిత్రమిది. సినిమా ప్రివ్యూ చూసిన అందరి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. సుకుమార్ గారికి చాలా స్హాల థాంక్స్. అని అన్నారు

హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ... మా సినిమాను సుకుమార్ గారు సపోర్ట్‌ చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా ప్రివ్యూ కు అద్భుతమైన స్పందన వచ్చింది. హ్యాపీ గా ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేయొచ్చు. ఈనెల 29న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. దర్శకుడు రవి ఎంటర్టైన్మెంట్ ని ఎమోషన్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేసాడు. అని అన్నారు.

More News

'జార్జ్ రెడ్డి' సినిమాను అందరూ చూడాలని కోెరుకుంటున్నా - మెగాస్టార్ చిరంజీవి

విద్యార్థి విప్లవోద్యమ నాయకుడు జార్జిరెడ్డి కథతో తెరకెక్కిన చిత్రం జార్జిరెడ్డి.

చిరు 152 రిలీజ్ ప్లానింగ్ మారిందా?

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది. కొర‌టాల శివ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

మాతృత్వంపై నెటిజ‌న్ ప్ర‌శ్న‌.. స‌మంత షాకింగ్ స‌మాధానం

పెళ్లైన అమ్మాయిని కొన్ని రోజుల త‌ర్వాత ద‌గ్గ‌రివాళ్లు, బంధువులు, స్నేహితులు అడిగే ప్ర‌శ్న‌ల్లో మొద‌టిది త‌ల్లిగా ఎప్పుడు మారుతున్నావ్‌? అని.

కొత్త భాష నేర్చుకుంటున్న క‌మ‌ల్‌హాస‌న్‌

యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్, శంక‌ర్ కాంబినేష‌న్‌లో 23 ఏళ్ల త‌ర్వాత రూపొందుతోన్న చిత్రం `ఇండియ‌న్ 2`.

మ‌రో వివాదానికి రాంగోపాల్ వ‌ర్మ శ్రీకారం

వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉండే ద‌ర్శ‌కుడెవ‌రంటే ఎవ‌రికైనా వెంట‌నే గుర్తుకొచ్చే పేరు రాంగోపాల్ వ‌ర్మ‌.