close
Choose your channels

సుక్కు కథ నిఖిల్ ని కూడా మార్చేసిందే!

Saturday, May 29, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సుక్కు కథ నిఖిల్ ని కూడా మార్చేసిందే!

టాలీవుడ్ లో ట్యాలెంట్ ఉన్న యంగ్ హీరోల్లో నిఖిల్ ఒకడు. చూడడానికి లవర్ బాయ్ లా కనిపిస్తాడు కానీ మనోడు చేసే ప్రతి చిత్రం విభిన్నంగా ఉంటుంది. యువ హీరోల్లో నిఖిల్ ని ఇదే అంశం ప్రత్యేకంగా నిలిపింది. నిఖిల్ తాజాగా నటిస్తున్న చిత్రం '18 పేజెస్'. ఈ చిత్రం ప్రతి ఒక్కరిలో ఆసక్తి కలిగిస్తోంది.

అందుకు కారణం లేకపోలేదు.. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి కథ అందిస్తుండడమే. నిఖిల్ ఈ చిత్రంలో కంప్లీట్ డిఫెరెంట్ గా కనిపించబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఈ చిత్ర ఫస్ట్ లుక్ తేదీని ప్రకటిస్తూ తాజాగా ఓ ప్రీలుక్ రిలీజ్ చేశారు. జూన్ 1 న ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

సుక్కు కథ నిఖిల్ ని కూడా మార్చేసిందే!

ప్రీ లుక్ లో నిఖిల్ సిగరెట్ తాగుతూ ఓ పేజీని కాల్చుతూ కాస్త మాస్ టచ్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు నిఖిల్ చేసిన చిత్రాల్లో అతడి లుక్, మ్యానరిజం లో పెద్దగా మార్పులు కనిపించవు. పోకిరి కుర్రాడిగా నటించినా అందులో క్లాస్ టచ్ మాత్రమే కనిపించేది.

కానీ 18 పేజెస్ చిత్రంలో సుకుమార్ కథ నిఖిల్ స్టైల్ మార్చేసిందా అనే సందేహాలు కలగక మానవు. తాజాగా విడుదల చేసిన ప్రీ లుక్ మాత్రం మాస్ అటెన్షన్ తీసుకుంటోంది. మరి ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.