శిష్యుడికి ఉప్పెనంత ప్రేమతో!: సుకుమార్

  • IndiaGlitz, [Tuesday,February 16 2021]

శిష్యుడు ప్రయోజకుడై మంచి స్థాయికి చేరుకుంటే ఆ గురువు కంటే సంతోషించేవారు ఎవరూ ఉండరు. వాడు నా శిష్యుడంటూ చెప్పుకుంటున్నప్పుడు ఆ గురువు కళ్లల్లో ఓ మెరుపు మెరుస్తుంది. గర్వంతో తనువు ఉప్పొంగుతుంది. ప్రస్తుతం అదే సంతోషాన్ని దర్శకుడు సుకుమార్ అనుభవిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన 'ఉప్పెన' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సునామీని సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. హీరో, హీరోయిన్‌, దర్శకుడికి ఇది తొలి చిత్రమే అయినా.. బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో.. ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది సుక్కు శిష్యుడు బుచ్చిబాబు సానా అన్న విషయం అందరికీ తెలిసిందే.

బుచ్చిబాబు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో శిక్షణ పొందారు. సుకుమార్ తరహాలోనే ‘ఉప్పెన’ రూపంలో ఓ విభిన్నమైన, సాహసోవంతమైన, అందమైన ప్రేమకథను ఓ ప్రేమకావ్యంలా మలిచారు. ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ.. వసూళ్ల సునామీతో దూసుకుపోతుంది. దీంతో సుక్కు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బుచ్చిబాబు తనపెద్ద కొడుకు అని.. తాను పుత్రోత్సాహంలో ఉన్నానని వేదికపై ఇప్పటికే సుక్కు చెప్పేశారు. తాజాగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బుచ్చిబాబుకు ప్రేమతో సుక్కు రాసిన ఓ లేఖ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. బుచ్చిబాబు తనను గురువును చేసేసరికి తాను తిరిగి శిష్యుడినైపోయానంటూ సుక్కు రాసిన లేఖ ఆకట్టుకుంటోంది.

‘‘నువ్వు నన్ను గురువును చేసే సరికి... నాకు నేను శిష్యుడినై పోయాను. ఇంత గొప్ప సినిమా తీయడానికి నువ్వు నా దగ్గర ఏం నేర్చుకున్నావా...? అని.. నాకు నేను శిష్యుడిని అయిపోతే తప్ప అదేంటో తెలుసుకోలేను. నాలోకి నన్ను అన్వేషించుకునేలా చేసిన సానా బుచ్చిబాబును ఉప్పెనంత ప్రేమతో అభినందిస్తూ.. ఇట్లు సుకుమార్ ఇంకో శిష్యుడు - సుకుమార్’’ అంటూ సకుమార్ రాసిన ఈ లేఖ అందరిని అలరిస్తుంది. ఓ శిష్యుడి పట్ల గురువుగారి ప్రేమను చూసి అందరూ సుకుమార్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు ఓ శిష్యుడిని దర్శకుడిగా చూడాలనే తపన, అతని సినిమా కోసం ఓ గురువు ప్రేమ, ఇదంతా సినీ పరిశ్రమలో చాలా అరుదు అంటూ ఈ గురు శిష్యుల గురించి అంతా చర్చించుకుంటున్నారు.

More News

నరేంద్ర మోడీపై ట్వీట్ చేసిన చిక్కుల్లో పడ్డ బిగ్ బాస్ బ్యూటీ

నటి, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ ఓవియా చిక్కుల్లో పడ్డారు. ఈ చిక్కులను ఆమె తనకు తాను క్రియేట్ చేసుకున్నారు మరి. అసలు ఇంతకీ ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే..

తూచ్.. వర్షాలు రాకూడదనలేదు: కొత్త మేయర్ విజయలక్ష్మి

నగరంలో వందేళ్ళలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు పడ్డాయని, అంతటి భారీ వర్షాలు, వరదలు రాకుండా చూడాలని దేవుడిని కోరుకుంటున్నానని చెప్పడమే తన ఉద్దేశమని విజయలక్ష్మి పేర్కొన్నారు.

'ఉప్పెన' నాలుగు రోజుల కలెక్షన్లు ఎంతో తెలిస్తే...

మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’ చిత్రం వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. శుక్రవారం థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

తెలంగాణలో ‘హస్త’మిస్తున్నా.. వీళ్లు మారరా?

కూర్చొన్న చోటు నుంచి కదలొద్దు.. కానీ విజయం కావాలంటూ కబుర్లు.. చేతుల నుంచి నియోజకవర్గాలకు నియోజకవర్గాలు జారి పోతున్నా.. నీరో చక్రవర్తిలా ఫిడేలు వాయించుకుంటూ కూర్చోవాలి.

కేంద్రం కీలక నిర్ణయం.. ఆ రెండు బ్యాంకులు గోవిందా?

దేశంలో అన్ని రకాల సంస్థల ప్రైవేటీకరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. తాజాగా బ్యాంకుల వంతు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణపై వడివడిగా అడుగులు వేస్తోంది.