'దర్శకుడు' మూవీ ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Sunday,April 16 2017]

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ నిర్మాతగా సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న 'దర్శకుడు' చిత్రం ఫస్ట్‌లుక్‌ని ఆదివారం సుకుమార్‌ విడుదల చేశారు.
సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై వచ్చిన 'కుమారి 21 ఎఫ్‌' చిత్రం ఎంతటి సెన్సేషన్‌ని క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రం తర్వాత వస్తున్న 'దర్శకుడు' చిత్రాన్ని సుకుమార్‌ తో కలిసి బిఎన్‌సిఎస్‌పి విజయ్‌కుమార్‌, థామస్‌ రెడ్డి ఆదూరి మరియు రవిచంద్ర సత్తి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అశోక్‌, ఈషా హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు హరిప్రసాద్‌ జక్కా. ప్రస్తుతం షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ సమ్మర్ కి విడుదల అయ్యేందుకు షూటింగ్ అనంతర కార్యక్రమాలను శరవేగంగా పూర్తిచేసుకుంటుంది.
ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలీ, సినిమాటోగ్రఫీ: ప్రవీణ్‌ అనుమోలు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ రమేష్‌ కోలా.

More News

'మా' సభ్యుల ఆరోగ్యమే మా ప్రధాన అంశం: 'మా' అధ్యక్షులు శివాజీరాజా

ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత లివర్ స్కానింగ్ క్యాంప్ కార్యక్రమం జరిగింది.

మళ్ళీ డైరెక్టర్ ఎటాక్..

జాతీయ అవార్డుల జ్యూరీ ఒత్తిళ్ళకు తలొగ్గి అవార్డులను ప్రకటించిందని ఘాటుగా స్పందించాడు స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్. అవార్డు కమిటీ ఛైర్మన్ ప్రియదర్శన్, అక్షయ్కుమార్కు మంచి స్నేహితుడు కాబట్టే ఉత్తమ నటుడు అవార్డును అతనికే ఇచ్చాడని వార్తలు వచ్చాయి.

వెబ్ సిరీస్ చేస్తున్న దర్శకురాలు...

ఇప్పుడు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది.

ఇల్లు కొనే ఆలోచనలో హీరోయిన్...

అందాల రాక్షసి చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేసిన లావణ్య త్రిపాఠి సోగ్గాడే చిన్నినాయనా, భలే భలే మగాడివోయ్ సినిమాల్లో నటించింది. ఇప్పుడు నాగచైతన్యతో ఓ సినిమాలో నటిస్తుంది.

రవితేజ్ బ్యాక్ డ్రాప్ అదే..

మాస్ మహారాజా రవితేజ హీరోగా విక్రమ్సిరికొండ దర్శకత్వంలో `టచ్చేసి చూడు`.ఈ సినిమా ఇప్పటికీ మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. పాండిచ్చేరి బ్యాక్డ్రాప్లో సినిమా రన్ అవుతుందని సమాచారం. ఈ షెడ్యూల్లో హీరో హీరోయిన్ మధ్య మాంటేజ్సాంగ్, కొన్ని సీన్స్ను చిత్రీకరించారట.