జూన్ 9న సుకుమార్ రైటింగ్స్ దర్శకుడు

  • IndiaGlitz, [Tuesday,May 16 2017]

కొత్తదనంతో కూడిన సృజనాత్మక కథాంశాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో సుకుమార్ రైటింగ్స్ సంస్థను స్థాపించారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. మొదటి ప్రయత్నంగా కుమారి 21ఎఫ్ చిత్రంతో చక్కటి విజయాన్ని దక్కించుకున్నారు. స్వీయ నిర్మాణ సంస్థపై ద్వితీయ ప్రయత్నంగా సుకుమార్ నిర్మిస్తున్న చిత్రం దర్శకుడు. అశోక్, ఇషా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి హరిప్రసాద్ జక్క దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశలో వున్నాయి. జూన్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఓ సినీ దర్శకుడి ప్రేమకథ ఇది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా అందరిని అలరిస్తుంది. కథలోని మలుపులు ఆసక్తిని రేకెత్తిస్తాయి. నవ్యమైన అంశాలు మేళవించిన ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది అన్నారు. ఇటీవల బ్యాంకాక్‌లో చిత్రీకరరించిన పాటతో షూటింగ్ మొత్తం పూర్తయింది.

ఈ నెల 22న ఓ ప్రముఖ స్టార్ హీరో చేతులమీదుగా టీజర్‌ను విడుదల చేయబోతున్నాం. ఇదే నెలలో ఆడియోను విడుదల చేస్తున్నాం అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సుకుమార్‌తో పాటు బిఎన్‌సిఎస్‌పి విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి అడూరి, రవిచంద్ర నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ అనుమోలు, ఎడిటింగ్: నవీన్‌నూలి, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కోలా.

More News

నా కెరీర్ లో డిఫరెంట్ సినిమా 'రాధ' : శర్వానంద్

సక్సెస్ ఫుల్ హీరో శర్వానంద్ తన సక్సెస్ స్ట్రీక్ ను కొనసాగిస్తూ కొట్టిన మరో హిట్ "రాధ". యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ హిలేరియస్ మూవీని ఎస్.వి.సి.సి పతాకంపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు.

మే 17న 'రారండోయ్.. వేడుక చూద్దాం' 3వ సాంగ్ విడుదల

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ.శే.శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో

ముస్తాబవుతున్న విజయేంద్రప్రసాద్ శ్రీవల్లి

బాహుబలి తొలి భాగం విడుదలైనప్పటి నుంచి రెండు ప్రశ్నలు నన్ను చాలా కాలం పాటు వెంటాడాయి.

సందీప్ కిషన్ కోసం రంగంలోకి దిగిన డైరెక్టర్ , రైటర్

తెలుగు,తమిళ భాషల్లో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తోన్న సందీప్ కిషన్ తాజాగా మరో నూతన చిత్రానికి

'కేశవ' సెన్సార్ పూర్తి.... 19 న రిలీజ్

‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’,‘సూర్య వర్సెస్ సూర్య’,‘కార్తికేయ’...