‘పుష్ప’ లో యాంకర్ సుమ నటించడంపై క్లారిటీ..!

  • IndiaGlitz, [Wednesday,May 27 2020]

టాలీవుడ్ స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అలియాస్ బన్నీ.. క్రియేటివ్‌ హెడ్‌గా పేరుగాంచిన సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఇప్పటికే బన్నీ బర్త్‌డే సందర్భంగా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. కరోనా మహమ్మారి విలయ తాండవం లేకుంటే ఈ పాటికే సినిమా షూటింగ్ 70% పైగా అయిపోయేది. కానీ.. కరోనా ఎఫెక్ట్‌తో చిత్రబృందం ఇంటికే పరిమితం అయ్యింది. ఈ క్రమంలో ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్‌ చూసుకుంటోంది. తెలుగుతో పాటు పలు భాషల్లో ‘పాన్‌ ఇండియా’గా వస్తున్న ఈ చిత్రం కోసం భారీగానే మైత్రీ మూవీ మేకర్స్ ఖర్చు పెడుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ రూమర్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

నిజమే అనుకున్నారు కానీ..

ఈ చిత్రంలో బన్నీకి అక్కగా టాప్ యాంకర్ సుమ కనకాల నటిస్తోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు ఇదేంటి.. ఎప్పుడూ షోలతో బిజిబిజీగా ఉండే సుమ.. సినిమాల్లో నటించడమేంటి..? అని అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పటికే నాలుగైదు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్‌గా చేసిన విషయం విదితమే. అయితే తాజాగా కూడా పాత్ర మంచిది కావడం.. సినిమాల్లో నటించి కూడా చాలా రోజులవ్వడంతో ఇది కరెక్టేనేమో అందరూ భావించారు.

అవన్నీ పుకార్లే..

ఈ వార్తపై చిత్రయూనిట్ స్పందిస్తూ.. అవన్నీ అవాస్తవాలే.. పుకార్లు నమ్మకండి అని క్లారిటీ ఇచ్చుకుంది. అసలు ఇలాంటి రూమర్స్ ఎవరు పుట్టించారో తెలియట్లేదని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. కాగా హాట్ యాంకర్ అనసూయ కూడా ఇందులో ముఖ్యపాత్రలో నటిస్తోందని వార్తలు వచ్చాయ్ కానీ.. ఈ వార్తలపై మాత్రం సినిమా యూనిట్ రియాక్ట్ కాలేదు. సో.. అనసూయ ఇందులో నటిస్తోందన్న మాట.

More News

లాక్ డౌన్ ఎఫెక్ట్ : యువ నటి ఆత్మహత్య

కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్‌తో సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ ఎలాంటి అవస్థలు పడుతున్నారో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.

థ్యాంక్యూ సీఎం జగన్ గారూ.. : నాగబాబు

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరర్థక ఆస్తుల అమ్మకాలపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

హైకోర్టు షాక్ : వైసీపీ ఎంపీ, ఆమంచి సహా 49 నోటీసులు

న్యాయస్థానాలు, న్యాయవాదులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అలాంటిది అన్నీ తెలిసిన అది కూడా ప్రజా ప్రతినిధులు వివాదాస్పద వ్యాఖ్యలు

ఐటెమ్ సాంగ్సే బెట‌రంటున్న ముద్దుగుమ్మ‌

సినీ ఇండ‌స్ట్రీలో ముఖ్యంగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టేవారంద‌రూ హీరోనో, హీరోయినో కావాల‌నే అడుగు పెడుతుంటారు. అదే కోరితో ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మల్లో హంసానందిని ఒక‌రు.

‘అల వైకుంఠ‌పురములో..’ గ్లోబెల్ రికార్డ్‌

ఈ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లోని పాట‌ల్లో అల వైకుంఠ పుర‌ములో సాంగ్స్‌కు వ‌చ్చినంత రెస్పాన్స్ మ‌రే సినిమాకు రాలేదు. అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో