నువ్వు నా బలం, సంతోషం: రాజీవ్‌కు సుమ శుభాకాంక్షలు

  • IndiaGlitz, [Friday,November 13 2020]

యాంకర్ సుమ కనకాల తన భర్త రాజీవ్ కనకాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. తన భర్తే తన బలం, సంతోషమని సుమ ఇన్‌స్టా వేదికగా పోస్ట్ పెట్టింది. రాజీవ్‌తో ఉన్న ప్రతి రోజూ తనకు కొత్తగానే ఉంటుందని తెలిపింది. ‘‘మై డియరెస్ట్ రాజా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు నా బలం, సంతోషం. నీతో ఉండేందుకు నేను పెట్టి పుట్టాను. నీతో కలిసి ఉన్న ప్రతిరోజూ నేనొక కొత్త రోజుగా భావిస్తూ ఉంటాను. లవ్ యూ, మై డియర్ రాజా కనకాల నేను నీతోనే ఏకాంతంగా ఉన్నాను డియర్’’ అంటూ పోస్ట్ పెట్టింది.

కాగా.. రాజీవ్ కనకాల నుంచి సుమ విడిపోయిందని.. వారిద్దరూ కొంతకాలంగా విడిగానే ఉంటున్నారంటూ ఆ మధ్య కాలంలో వార్తలొచ్చాయి. అయితే దీనిపై ఇద్దరూ స్పందించలేదు కానీ తాము కలిసే ఉన్నామన్నట్టుగా కొన్ని షోస్‌కి జంటగా హాజరై అలరించారు. తాము ఎప్పుడూ విడిపోలేదని.. కలిసే ఉన్నామని చెప్పకనే చెప్పారు. కాగా.. నేడు రాజీవ్ పుట్టినరోజు సందర్భంగా సుమ ఇన్‌స్టాలో శుభాకాంక్షలు చెప్పి తన ప్రేమను చాటుకుంది. అభిమానులు సైతం రాజీవ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

More News

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కోసం పోటీ పడుతున్న ఆశావహులు..

తెలంగాణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల కోసం ఆశావహులు పోటీ పడుతున్నారు.

నాని 28వ సినిమా... వెలువడిన ప్రకటన

నేచురల్‌ స్టార్‌ నాని వరుస సినిమాలకు ఓకే చెబుతూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం నాని తన 26వ చిత్రం 'టక్‌ జగదీష్‌' సెట్స్‌పైనే ఉంది.

తెలంగాణలో క్రాకర్స్ బ్యాన్‌పై సుప్రీంలో లంచ్ మోషన్ పిటిషన్..

క్రాకర్స్ బ్యాన్‌పై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.

లేటెస్ట్‌ మూవీ లుక్‌ విడుదల చేసిన విజయ్‌ ఆంటోని

'నకిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌' వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని.

ప్రేమ పెళ్లికి సిద్ధమవుతున్న ప్రభుదేవా!

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా మరోసారి ప్రేమలో పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వివాహమై ప్రభుదేవాకు పిల్లలున్నారు.