తాత చెప్పిన ఆ మాటే నరుడా డోనరుడా సినిమా తీసేలా చేసింది - సుమంత్

  • IndiaGlitz, [Monday,October 31 2016]

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ న‌టించిన తాజా చిత్రం న‌రుడా డోన‌రుడా. ఈ చిత్రంలో సుమంత్ స‌ర‌స‌న ప‌ల్ల‌వి సుభాష్ న‌టించింది. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్ తెర‌కెక్కించారు. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. బాలీవుడ్ లో రూపొందిన విక్కీడోన‌ర్ చిత్రానికి రీమేక్ గా రూపొందిన న‌రుడా డోన‌రుడా చిత్రం న‌వంబ‌ర్ 4న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో త‌నికెళ్ల‌భ‌ర‌ణి మాట్లాడుతూ...ఈ చిత్రంలో ఓ ప్ర‌త్యేక‌పాత్ర పోషించాను. నాకు ఈ సినిమా సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది. సినిమా మొత్తంలో దాదాపు 60% క‌నిపిస్తాను. త‌మాషా స‌బ్జెక్ట్ ఇది. ఈ మూవీ కోసం టీమ్ వ‌ర్క్ చేసిన విధానం చూస్తుంటే నాకు లేడీస్ టైల‌ర్ రోజులు గుర్తుకువ‌చ్చాయి. ఈ సినిమాని తెర‌కెక్కిండం అంటే క‌త్తిమీద సాము లాంటిది. అయినా...ఎలాంటి బూతు లేకుండా డైరెక్ట‌ర్ మ‌ల్లిక్ రామ్ చాలా బాగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ సినిమాకి క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అన్నీ సుమంతే. నేను పోషించిన పాత్ర‌ను విక్కీడోన‌ర్ లో పోషించిన అనుక‌పూర్ కి నేష‌న‌ల్ అవార్డ్ వ‌చ్చింది. 90% ఎంట‌ర్ టైన్మెంట్, 10% మెసేజ్ ఉంది. అద్భుత‌మైన సందేశం ఉంది. సుమంత్ కెరీర్ లో గుర్తుండే సినిమా అవుతుంది అన్నారు.
నిర్మాత సుధీర్ మాట్లాడుతూ...సుమంత్ చాలా గ్యాప్ త‌రువాత చేస్తున్న సినిమా ఇది. ఇలాంటి సినిమా చేయ‌డానికి గ‌ట్స్ కావాలి. న‌వంబ‌ర్ 4న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. మా చిత్రానికి మంచి స్పంద‌న ల‌భిస్తుంది అనే న‌మ్మ‌కం ఉంది. ఈ సినిమాతో సుమంత్ ఎలాంటి క్యారెక్ట్ అయినా చేయ‌గ‌ల‌డు అనే పేరు తెచ్చుకుంటాడు అన్నారు.
డైరెక్ట‌ర్ మ‌ల్లిక్ రామ్ మాట్లాడుతూ...ఈ సినిమా చేస్తున్న‌ప్పుడు రిస్క్ చేస్తున్నాం అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. ఎందుకంటే... ప‌క్కాగా స్ర్కిప్ట్ రెడీ చేసుకున్నాం. దీంతో సెట్స్ పైకి వెళ్లిన త‌ర్వాత ఎలాంటి క‌న్ ఫ్యూజ‌న్ లేకుండా ఈ మూవీని తెర‌కెక్కించాను. మెసేజ్ ఉన్న ఈ మూవీని ఎంట‌ర్ టైనింగ్ చేస్తూ అంద‌రికి న‌చ్చేలా రూపొందించాం. ఇలాంటి మూవీస్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. మా సినిమాకి అన్ని బాగా కుదిరాయి. అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు ఈ చిత్రం నచ్చుతుంది అన్నారు.
నిర్మాత సుప్రియ మాట్లాడుతూ... విక్కీడోన‌ర్ రీమేక్ చేస్తున్నాను అని సుమంత్ చెప్ప‌గానే గ‌ట్టిగా న‌వ్వి ఆడియోన్స్ ఆద‌రిస్తారా..? అన్నాను. సినిమా పూర్తైన త‌ర్వాత చూసాను. ఆడియోన్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసేలా చాలా బాగా తీసారు. సినిమా చూస్తున్నంత సేపు న‌వ్వ‌తూనే ఉన్నాను. లాస్ట్ లో క‌ళ్లంట నీళ్లు వ‌స్తాయి. గ‌త 20 ఏళ్లుగా సినిమా చూసి క‌ళ్లంట నీళ్లు వ‌చ్చేలా ఎమోష‌న‌ల్ మూవీస్ రావ‌డం లేదు.మంచి సినిమాని అందిస్తున్న‌ ఈ టీమ్ ని మ‌న‌స్పూర్తిగా అభినందిస్తున్నాను. అంద‌రూ చూడాల్సిన సినిమా ఇది అన్నారు.
హీరో సుమంత్ మాట్లాడుతూ...విక్కీడోన‌ర్ మూవీని 2012లో చూసాను. గోల్కండ స్కూల్ త‌ర్వాత మూడు సినిమాలు చేసాను కానీ ఆడ‌లేదు. ఓరోజు టీవీలో విక్కీడోన‌ర్ మూవీని తాత చూసి ఇలాంటి సినిమాలు కూడా వ‌స్తున్నాయా..? మ‌న ద‌గ్గ‌ర కూడా ఇలాంటి కొత్త సినిమాలు వ‌స్తే బాగుంటుంది అన్నారు. తాత చెప్పిన ఆ మాటతో నాకు బ‌ల్బు వెలిగిన‌ట్టు అనిపించింది. అప్ప‌టి నుంచి విక్కీడోన‌ర్ లాంటి సినిమా చేయాలి అనుకున్నాను. నాకు క‌థ చెప్ప‌డానికి వ‌చ్చిన వాళ్ల‌కి విక్కీడోన‌ర్ లాంటి సినిమా కావాలి అని చెప్పి చెప్పి విసుగువ‌చ్చేసింది. ఆ టైమ్ లో నిర్మాత రామ్మోహ‌న్ ని క‌లిసిన‌ప్పుడు విక్కీడోన‌ర్ లాంటి సినిమా ఎందుకు విక్కీడోన‌ర్ సినిమానే రీమేక్ చేయ‌చ్చు క‌దా అన్నారు. అప్పుడు రీమేక్ చేద్దాం అని డిసైడ్ అయి ముంబాయి వెళ్లి జాన్ అబ్ర‌హం ద‌గ్గ‌ర రీమేక్ రైట్స్ తీసుకున్నాను. ఈ సంద‌ర్భంగా జాన్ అబ్ర‌హంకు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను.
క్ష‌ణం చిత్రాన్ని కోటి రూపాయ‌ల బ‌డ్జెట్ తో రూపొందించారు. దీంతో మేము కూడా లిమిటెడ్ బ‌డ్జెట్ లో ఈ సినిమా చేయాలి అని చేసాం. ఏక్టివ్ ప్రొడ్యూస‌ర్ గా ఈ మూవీని చేసాను. మ‌న నేటివిటికి త‌గ్గ‌ట్టు కొన్ని మార్పులు చేసాం. మ‌హేష్ తో టీజ‌ర్ రిలీజ్ చేయాలి అన‌గానే ఏం ఆలోచించ‌కుండా ఓకే చేస్తాను అన్నాడు. మ‌హేష్ చేతుల మీదుగా రిలీజైన టీజ‌ర్ ను 50 ల‌క్ష‌ల మంది చూసారు. ఈ టీజ‌ర్ కు వ‌చ్చిన రెస్పాన్స్ చూసి సంతోష‌ప‌డాలో, అంచ‌నాలు పెరగ‌డం వ‌ల‌న భ‌య‌ప‌డాలో అర్ధం కావ‌డం లేదు. విక్కిడోన‌ర్ సినిమాకి ఇది జిరాక్స్ కాపీ కాదు. ఈ మూవీ ఫ్రెష్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ క‌లిగిస్తుంది అన్నారు.

More News

సినిమాల గురించి క్లారిటీ ఇచ్చిన నిర్మాత

తెలుగులో ఈ ఏడాది మా బ్యానర్లో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. ., అందులో మూడు సినిమాలు పెద్ద సక్సెస్ సాధించాయని చెప్పుకొచ్చారు నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి. క్షణం, బ్రహ్మోత్సవం, ఊపిరి, కాష్మోరా సినిమాలు విడుదలైతే బ్రహ్మోత్సవం తప్ప మిగిలిన సినిమాలు మంచి విజయాలను సాధించాయి.

సింగం3లో అవే కనపడతాయట

సూర్య, హరి కాంబినేషన్లో వచ్చిన సింగం సీక్వెల్స్ పెద్ద హిట్ చిత్రాలుగా నిలిచాయి. ఇప్పుడు సింగం 3 డిసెంబర్ 16న విడుదలవుతుంది. ఈ చిత్రంలో అనుష్కతో పాటు శృతిహాసన్ నటిస్తుంది. శృతిహాసన్ రోల్ గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి.

నవంబర్ 6 న విజయ్ ఆంటోని 'బేతాళుడు' ఆడియో విడుదల

విజయ్ ఆంటోని' కధానాయకునిగా తమిళంలో రూపొందుతున్న 'సైతాన్' చిత్రం తెలుగు ప్రేక్షకులను 'బేతాళుడు' గా త్వరలో పలకరించబోతోంది.'బేతాళుడు' చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

కాటమరాయుడు దీపావళి స్పెషల్ మోషన్ పోస్టర్ రిలీజ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం కాటమరాయుడు.

దీపావళి సందర్భంగా మనోజ్ గుంటూరోడు ఫస్ట్ లుక్ రిలీజ్..!

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా S.K. సత్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం గుంటూరోడు. క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై శ్రీ వరుణ్ అట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.