close
Choose your channels

కొత్త ఏటిటిలో డిసెంబ‌ర్ 18న విడుద‌ల అవ్వ‌బోతున్న 'డ‌ర్టీ హ‌రి'

Monday, November 30, 2020 • తెలుగు Comments

ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిచిన రొమాంటిక్ మూవీ డ‌ర్టీ హ‌రి. రుహాని శ‌ర్మ‌, శ్ర‌వ‌ణ్ రెడ్డి, సిమ‌త్ర కౌర్ త‌దిత‌ర‌లు న‌టించిన ఈ సినిమా టీజ‌ర్ కి సోష‌ల్ మీడియాలో విశేష ఆద‌ర‌ణ ల‌భించిన విష‌యంలో తెలిసిందే, ఈ నేప‌థ్యంలో డ‌ర్టీ హ‌రి చిత్రాన్ని ఓ కొత్త ఓటిటి ద్వారా డిసెంబ‌ర్ 18న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు మొద‌లైయ్యాయి.

ఇప్పటికే తెలుగు ప్రేక్ష‌కులు ఓటిటిల్లో విడుద‌ల అవుతున్న సినిమాల్ని ఆద‌రిస్తున్నారు, దీంతో కొంద‌రు సినీ ప్రముఖలు ఈ ఏటీటీని తీసుకు రాబోతున్నారు, ఇందులో తొలి సినిమాగా డ‌ర్టీ హ‌రీని ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. పే ఫర్ వ్యూ పద్దతిలో నడిచే ఈ కొత్త ఏటీటీ యాప్ కు తెలుగు ఆడియెన్స్ లో ప్రత్యేక స్థానం ఉంటుందని అంతా చాలా బలంగా నమ్ముతున్నారు. డర్టీ హరి చిత్రంతో పాటు ఇంకా పలు సినిమాలు ఈ కొత్త ఏటీటీ స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి. ఫోన్ కాల్ చేసి సినిమా చూసే నూత‌న‌ విధానంను ఈ కొత్త ఏటీటీ రెడీ అవుతుంది.

ఈ ఏటిటి కి ఇద్ద‌రు పెద్ద ద‌ర్శ‌కులు ప‌నిచేయ‌టం విశేషం, వారే ఈ యాప్ ని యూజ‌ర్ ఫ్రెండ్లీగా సిద్ధం చేశారు. ఈ ఏటిటి డిసెంబర్ 18న లాంచ్ చేస్తున్నారు డిసెంబ‌ర్ మెద‌టి వారం లో దీని గురించి అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది, మ‌రిన్ని వివ‌రాలు కూడా అతిత్వ‌ర‌లో విడుద‌ల అవుతాయి.

Get Breaking News Alerts From IndiaGlitz