సీనియర్ డైరెక్టర్ తో సుమంత్ అశ్విన్

  • IndiaGlitz, [Thursday,February 23 2017]

ఒక‌ప్పుడు స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించిన ఎం.ఎస్‌.రాజు ఇప్పుడు హిట్ మూవీస్ లేక కామ్ అయ్యారు. ఈయ‌న త‌న‌యుడు సుమంత్ అశ్విన్ తూనీగ తూనీగ సినిమా తెరంగేట్రం చేసి వ‌రుస సినిమాలు చేశాడు. అంత‌కు ముందు ఆ త‌ర్వాత‌, ల‌వ‌ర్స్ సినిమాలు మిన‌హా సుమంత్‌కు చెప్పుకోద‌గ్గ హిట్స్ లేవు.
రీసెంట్‌గా సుమంత్ అశ్విన్ చేసిన రైట్ రైట్ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ఎలాగైనా హిట్ కొట్టాల‌నుకుంటున్న సుమంత్ అశ్విన్ ఈసారి సీనియ‌ర్ ద‌ర్శ‌కుడైన విజ‌య్‌భాస్క‌ర్ ద‌ర్శ‌కత్వంలో సినిమా చేయ‌బోతున్నాడు. గ‌తంలో చిరున‌వ్వుతో, నువ్వు నాకు న‌చ్చావ్ వంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్ చిత్రాల‌తో సూప‌ర్‌హిట్ కొట్టిన ఈ ద‌ర్శ‌కుడు ఈ మ‌ధ్య స‌రైన హిట్స్ లేక సైలెంట్ అయిపోయాడు. మ‌రి ఇప్పుడు సుమంత్ ఆశ్విన్‌తో అయినా హిట్ కొట్టి ట్రాక్‌లోకి వ‌స్తాడేమో చూడాల్సిందే

More News

'వైశాఖం' చిత్రానికి ఓ స్పెషల్ క్రేజ్ వచ్చింది

'కీసరగుట్ట శివాలయంలో శివుడి ఆశీస్సులతో షూటింగ్ ప్రారంభమైన మా 'వైశాఖం' దిగ్విజయంగా శివరాత్రికి పూర్తయింది'

నాని, దర్శకుడు 'హనురాఘవపూడి' ల కాంబినేషన్ లో మరో చిత్రం

వరుసగా 'కృష్ణ గాడి వీర ప్రేమగాధ' ', 'జెంటిల్ మాన్', 'మజ్ను' 'నేను లోకల్ ' వంటి ఘన విజయం సాధించిన చిత్రాల కధానాయకుడు నాచురల్ స్టార్ నాని హీరోగా నూతన యువ నిర్మాతలు శ్రీనివాస ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరువూరి సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు.

కె.వి.రెడ్డి అవార్డు అందుకున్న క్రిష్

'యువకళావాహిని' అధ్వర్యం లో రవీంద్రభారతిలో ఫిబ్రవరి 22న కె.వి .రెడ్డి అవార్డు ప్రదానోత్సవం ఘనం గా జరిగింది .

నారా హీరోతో మూడోసారి...

బాణం చిత్రంతో తెరంగేట్రం చేసిన యంగ్ హీరో నారా రోహిత్..

చిరు, రజనీలను మించిన పవన్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..సినిమాల్లో డిఫరెంట్ క్రేజ్ ఉన్న హీరో..