'రైట్ రైట్' అంటున్న సుమంత్ అశ్విన్

  • IndiaGlitz, [Monday,November 09 2015]

లవర్స్, కేరింత, కొలంబస్.. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్న సుమంత్ అశ్విన్ ప్రస్తుతం 'రైట్ రైట్' అంటున్నారు. శ్రీ సత్య ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై నూతన దర్శకుడు మను దర్శకత్వంలో జె. వంశీకృష్ణ నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ 7న ఆరంభం కానుంది. ఈ చిత్రవిశేషాలను జె. వంశీకష్ణ తెలియజేస్తూ - "మంచి కథలు, పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ సాగిస్తున్న సుమంత్ అశ్విన్ ఖాతాలో ఇది మరో మంచి చిత్రం అవుతుంది.

ఇప్పటివరకూ ఆయన చేసిన చిత్రాలకు, పాత్రలకు పూర్తి భిన్నంగా సాగే చిత్రం ఇది. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఓ సంచలన చిత్రానికి ఇది రీమేక్. 'మర్యాద రామన్న', 'బాహుబలి' చిత్రాల్లో విలన్ గా చేసిన ప్రభాకర్ ఇందులో కామెడీ క్యారెక్టర్ లో కనిపిస్తారు. ఆ పాత్ర ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇతర తారాగణం వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. విజయనగరం, అరకు లోయ పరిసర ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్ లో చిత్రాన్ని పూర్తి చేస్తాం. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నాం. యూత్, ఫ్యామిలీస్ ని ఆకట్టుకునే విధంగా ఈ 'రైట్ రైట్' ఉంటుంది'' అని చెప్పారు.

ఈ చిత్రానికి మాటలు: 'డార్లింగ్' స్వామి, కెమెరా: శేఖర్ వి. జోసఫ్, సంగీతం: జె.బి, ఆర్ట్: కె.ఎం. రాజీవ్, సహ నిర్మాత: జె. శ్రీనివాస రాజు.

More News

బ్లాక్ బస్టర్ హీరోతో గౌతమ్ మీనన్

కొత్తదనానికి పెట్టింది పేరు దర్శకుడు గౌతమ్ మీనన్.డిఫరెంట్ ఫిల్మ్స్ కు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ దర్శకుడు ప్రస్తుతం నాగ చైతన్య తో ''సాహసం శ్వాసగా సాగిపో''సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

'బ్రహ్మోత్సవం' లో మహేష్ పేరు అదేనా?

''శ్రీమంతుడు''వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహేష్ బాబు నటిస్తున్న చిత్రం ''బ్రహ్మోత్సవం''.''సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు''వంటి విజయవంతమైన చిత్రం తరువాత శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో మహేష్ యాక్ట్ చేస్తున్న సినిమా ఇది.

సూర్య 24 ఫ‌స్ట్ లుక్ రిలీజ్ డేట్

హీరో సూర్య‌, మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్ లో రూపొందుతున్నక్రేజీ మూవీ 24. ఈ చిత్రంలో సూర్య స‌ర‌స‌న స‌మంత‌, నిత్యా మీన‌న్ న‌టిస్తున్నారు.

నాని కూడా వ‌స్తున్నాడు

యంగ్ హీరో నాని హీరోగా హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది.

'సీతారామ‌రాజు'తో 'ఊపిరి'కి లింకేంటి?

అక్కినేని కుటుంబంలో రెండో త‌రం న‌టుడు నాగార్జున‌.. నంద‌మూరి ఫ్యామిలీలో రెండో త‌రం న‌టుడు హ‌రికృష్ణ క‌లిసి న‌టించిన సినిమాగా 'సీతారామ‌రాజు'కి ప్ర‌త్యేక స్థానం ఉంది.