సుమంత్ ఈ సారీ హిట్ కొడతాడా?

  • IndiaGlitz, [Wednesday,October 07 2015]

చాక్లెట్ బోయ్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న యువ క‌థానాయ‌కుడు సుమంత్ అశ్విన్‌. ప్ర‌ముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు త‌న‌యుడు అనే ట్యాగ్‌లైన్‌తో టాలీవుడ్‌లో హీరోగా అడుగులు వేసిన సుమంత్‌.. సినిమా సినిమాకి న‌టుడుగా ఎదుగుతున్నాడు. 'అంత‌కు ముందు ఆ త‌రువాత‌', 'ల‌వ‌ర్స్‌', 'కేరింత' చిత్రాల‌తో విజ‌యాల‌నూ త‌న ఖాతాలో వేసుకున్న ఈ యువ క‌థానాయ‌కుడు న‌టిస్తున్న తాజా చిత్రం 'కొలంబ‌స్‌'. డిస్క‌వ‌రీ ఆఫ్ ల‌వ్ అనేది దీనికి క్యాప్ష‌న్‌. ఫ్రెష్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకుంది. ర‌చ‌యిత‌ ర‌మేష్ సామ‌ల ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేస్తున్నాడు.

'చిన్న‌దానా నీకోసం' ఫేమ్ మిస్తీ, 'ర‌న్ రాజా ర‌న్' , 'టైగ‌ర్' చిత్రాల క‌థానాయిక సీర‌త్ క‌పూర్ ఇందులో హీరోయిన్లు. 'కేరింత' వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత వ‌స్తున్న ఈ సినిమా కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాడ‌ట సుమంత్‌. గ‌తేడాది 'ల‌వ‌ర్స్‌', 'చ‌క్కిలిగింత‌'.. ఇలా రెండు సినిమాలు విడుద‌లైతే వాటిలో ఒక‌టి మాత్ర‌మే స‌ద‌రు యంగ్ హీరోకి హిట్ నిచ్చింది. ఈ ఏడాదిలోనూ రెండు సినిమాల ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తున్న సుమంత్‌ 'కేరింత' త‌రువాత వ‌స్తున్న 'కొలంబ‌స్‌'తోనూ హిట్ కొడ‌తాడేమో చూడాలి. ఆల్ ది బెస్ట్ సుమంత్‌!

More News

అప్పుడు ముంతాజ్.. ఇప్పుడు రాయ్ లక్ష్మీ..

పవన్ కళ్యాణ్ సినిమాకు హిట్ టాక్ వస్తే..ఆ సినిమా రేంజ్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ నే.

సుప్రీమ్ హీరో క్యారెక్టర్ ఇదే...

పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలతో సక్సెస్ సాధించిన మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్... మరో విజయం సాధించడం కోసం రెడీ అవుతున్నాడు.

తమన్నా'బ్యాక్ టు బ్యాక్' ముచ్చట

'శ్రీ'సినిమాతో కథానాయికగా తొలి అడుగులు వేసింది తమన్నా.

పవన్ ఫ్యాన్స్ పై వర్మ మరోసారి ఫైర్....

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..పవన్ కళ్యాణ్ కి ట్విట్టర్ లో ఫాలోవర్స్ మహేష్,సమంతల కంటే తక్కువ ఉన్నారని..

వర్మ న్యూ ట్రైలర్ 'ఎటాక్'

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ క్రైమ్ నేపథ్యంతో తెరకెక్కిస్తున్నతాజా చిత్రం ఎటాక్.ఈ చిత్రంలో మంచు మనోజ్,సురభి జంటగా నటినటించారు.