సుమంత్ కొత్త సినిమా టైటిల్

  • IndiaGlitz, [Friday,February 16 2018]

చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీరావా' సినిమాతో విజయాన్ని అందుకున్నారు సుమంత్. ఆ సినిమాలో కార్తిక్‌గా సుమంత్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ఫీల్ గుడ్ ఫిలింతో గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా పరిచయమయ్యారు. అందుకే మళ్ళీ ఆ బాటలోనే తన తదుపరి చిత్రాన్ని కూడా తెరకెక్కించే అవకాశం మరో కొత్త దర్శకుడికే ఇచ్చారు సుమంత్. ఈ చిత్రంతో అనిల్ శ్రీకాంతం దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

అలాగే ఈ సినిమా ద్వారా కేర‌ళ కుట్టి అంజు కురియన్ తెలుగు తెర‌కు కథానాయికగా ప‌రిచ‌యం కానుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో నైట్ షిఫ్ట్ ఉద్యోగం చేసే ప్రెస్ ఫోటోగ్రాఫరుగా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నారు సుమంత్. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్న ఈ చిత్రానికి ఇదం జగత్' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. అయితే దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇక వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో మూవీని విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

More News

దర్శకుడికి నాగశౌర్య ఖరీదైన కానుక

ఆనందాన్ని పది మందితో పంచుకుంటే అది రెట్టింపు అవుతుందంటారు.

పవన్ కళ్యాణ్ తో యోగేంద్ర యాదవ్ , చలసాని శ్రీనివాసరావు భేటీ

స్వరాజ్ అభియాన్ నేత,అమ్ ఆద్మీ మాజీ కార్యనిర్వాహక సభ్యుడు శ్రీ యోగేందర్ యాదవ్ జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ ను గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో కలుసుకున్నారు.

మల్టీ స్టారర్ మూవీలో 'యు- టర్న్' భామలు

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కథానాయకులుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కబోతోంది. ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలింలో నాగార్జున డాన్‌గా నటించనున్నారు. ఇక డాక్టర్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఇదిలా ఉంటే...ఈ సినిమాలో నాగ్‌కు జంటగా శ్రద్ధా శ్రీనాథ్ పేరును పరిశీలిస్తున్నారు.

'అ!'సినిమాకి అదో ప్లస్ పాయింట్

కథానాయకుడిగా వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు యువ కథానాయకుడు నాని.

అప్పుడు మహాలక్ష్మి.. ఇప్పుడు రామలక్ష్మి

కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా...నాయికా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కూడా నటిస్తూ కథానాయికగా