స్టార్ హీరోయిన్స్‌కు స‌మ‌న్లు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌తో పాటు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్‌కు స‌మ‌న్లు అందించిన‌ట్లు స‌మాచారం. బాలీవుడ్ నుండి టాలీవుడ్‌, శాండిల్ వుడ్ సినీ ప్ర‌ముఖుల‌కు డ్ర‌గ్ మాఫియాతో సంబంధాలున్న‌ట్లు నార్కోటిల్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ)కి ఆధారాలు ల‌భించ‌డంతో వారు కేసును వేగ‌వంతం చేశారు. కొన్నిరోజులుగా ఇప్ప‌టికే అరెస్ట్ అయిన రియా చ‌క్ర‌వ‌ర్తి, ఆమె సోద‌రుడు, ఇత‌రులు అందించిన స‌మాచారంతో ఎన్‌సీబీ ఓ లిస్టును త‌యారు చేసింది. ఈ లిస్టులో దీపికా ప‌దుకొనె, సారా అలీఖాన్‌, శ్రద్ధాక‌పూర్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్, న‌మ్ర‌త శిరోద్క‌ర్‌ పేర్తు ఉన్న‌ట్లు వార్త‌లు ప్ర‌ముఖంగా మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

కానీ లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ లిస్టులో ఉన్న‌వారిలో న‌మ్ర‌త శిరోద్క‌ర్ మిన‌హా మిగిలిన వారంద‌రికీ స‌మ‌న్లు అందాయ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. మ‌రి వీరు ఎన్‌సీబీ విచార‌ణ‌కు ఎప్పుడు హాజ‌ర‌వుతార‌నే విష‌యంపై వార్త‌లేమీ తెలియ‌డం లేదు. ఇంకా ఎంత మంది పేర్లు బ‌య‌ట‌కు వ‌స్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరో వైపు నిర్మాత మధు మంతెనను ఎన్‌సీబీ బుధవారం రోజున విచారణ చేస్తున్నట్లు టాక్. మరి ఈయన నుండి నార్కోటిక్ విభాగం ఎలాంటి సమాచారాన్ని రాబడుతుందో వేచి చూడాలి.

More News

అనురాగ్‌పై కేసు ఫైల్ చేసిన పాయ‌ల్‌

డైరెక్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్‌పై రీసెంట్‌గా లైంగిక ఆరోప‌ణ‌లు చేసిన న‌టి పాయ‌ల్ ఘోష్ ఇప్పుడు ఆయ‌న‌పై పోలీస్ స్టేష‌న్‌లోకేసు న‌మోదు చేశారు. ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేష‌న్‌లో పాయ‌ల్ ఫిర్యాదును

ఒక్క ట్వీట్ చాలు.. పోకిరీల పని ఫసక్..

ఇవాళా.. రేపు ట్విట్టర్ ఖాతాలు అందరికీ ఉంటూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్విట్టరే బాధితులకు వరంగా మారనుంది. మనల్ని ఎవరో వేధిస్తున్నారంటూ మన బంధువులకో..

భారత్‌లో 57 లక్షలకు చేరువలో కేసులు..

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య 57 లక్షలకు చేరువవుతుండగా.. మరణాల సంఖ్య 90 వేలు దాటింది. అలాగే కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉండటం ఊరట కలిగిస్తోంది.

'రంగ్‌దే' షూటింగ్ స్టార్ట్..

‘భీష్మ’ మంచి సక్సెస్ సాధించిన అనంతరం అదే జోష్‌తో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తదుపరి చిత్రం ‘రంగ్‌దే’. ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు వెంకీ అట్లూరి

ఆదిలోనే కొడాలిని కంట్రోల్‌లో పెట్టి ఉంటే..

అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు అంటారు. ఇదే విషయాన్ని ఏపీ సీఎం జగన్ తమ పార్టీ నేతల విషయంలో పాటించలేదనేది పలువురి వాదన. ముఖ్యంగా మంత్రి కొడాలి నానిని ఆదిలోనే కంట్రోల్‌లో పెట్టి ఉండే