close
Choose your channels

సందీప్‌.. తాప్సీ ట్వీట్ చూశావా?

Tuesday, July 16, 2019 • తెలుగు Comments

సందీప్‌.. తాప్సీ ట్వీట్ చూశావా?

సందీప్‌.. తాప్సీ ట్వీట్ చూశావా?  వామ్మో తాప్సీ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? అంటూ ప‌లువురు విస్తుపోతున్నారు. అంత మంది విస్తుపోయేలా తాప్సీ ఏం ట్వీటు వేసింది?... ఇటీవ‌ల నాగ్‌పూర్‌లో ఒక‌త‌ను త‌న ప్రియురాలిపై అనుమానంతో త‌ల‌ప‌గ‌ల‌గొట్టాడు. ఈ వార్త ఆంగ్ల ప‌త్రిక‌లో వ‌చ్చింది. దీన్ని ట్యాగ్ చేస్తూ తాప్సీ `వారిద్ద‌రూ ప్రేమ‌లో ఉండి ఉంటారు. పిచ్చిగా ప్రేమించుకుంటూ ఉండుంటారు. వారి ప్రేమ‌ను నిరూపించుకోవ‌డానికే అత‌ను ఆమె త‌ల‌ను ప‌గ‌ల‌గొట్టి ఉంటాడు` అని రాసింది. తాప్సీ అలా ఎందుకు పెట్టిందో తెలిసిన వారు మాత్రం కిసుక్కున న‌వ్వుకున్నారు. 

కానీ తెలియ‌నివారు తెగ ట్రోల్ చేశారు. దీనికి తాప్సీ స్పందిస్తూ మీకు ఇందులో హాస్యం తెలియ‌కపోతే నేనేం చేయ‌లేను అని క‌రాఖండిగా చెప్పేసింది. ఇంత‌కీ ఆమె అన్న‌దాన్లో అర్థం ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగాకు బాగా తెలుసు.ఆ  మ‌ధ్య క‌బీర్‌సింగ్ చిత్రంలో హీరో, హీరోని కొట్టిన స‌న్నివేశాల‌ను గురించి సందీప్ మాట్లాడుతూ ``ప్రేమ‌లో కొట్టుకోవ‌డం, ముద్దుపెట్టుకోవ‌డం మామూలు ఎమోష‌న్సే`` అని అన్నారు. అప్పుడే సామాజిక మాధ్య‌మాల్లో ప‌లువురు సెల‌బ్రిటీలు అత‌ని మాట‌ల‌ను తిప్పికొట్టారు. వెంట‌నే అత‌ను వాళ్లు అర్థం చేసుకున్న భావంతో తాను ఏమీ అన‌లేద‌ని చెప్పాడు. కానీ అప్పుడు ఏమీ అన‌ని తాప్సీ, దాన్ని మ‌న‌సులో పెట్టుకుని ఇప్పుడు ట్వీట్ చేయ‌డం మాత్రం ఆమెలోని వ్యంగ్య‌మైన కోణానికి అద్దంప‌డుతోంద‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz