సందీప్‌.. తాప్సీ ట్వీట్ చూశావా?

  • IndiaGlitz, [Tuesday,July 16 2019]

సందీప్‌.. తాప్సీ ట్వీట్ చూశావా?  వామ్మో తాప్సీ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? అంటూ ప‌లువురు విస్తుపోతున్నారు. అంత మంది విస్తుపోయేలా తాప్సీ ఏం ట్వీటు వేసింది?... ఇటీవ‌ల నాగ్‌పూర్‌లో ఒక‌త‌ను త‌న ప్రియురాలిపై అనుమానంతో త‌ల‌ప‌గ‌ల‌గొట్టాడు. ఈ వార్త ఆంగ్ల ప‌త్రిక‌లో వ‌చ్చింది. దీన్ని ట్యాగ్ చేస్తూ తాప్సీ 'వారిద్ద‌రూ ప్రేమ‌లో ఉండి ఉంటారు. పిచ్చిగా ప్రేమించుకుంటూ ఉండుంటారు. వారి ప్రేమ‌ను నిరూపించుకోవ‌డానికే అత‌ను ఆమె త‌ల‌ను ప‌గ‌ల‌గొట్టి ఉంటాడు' అని రాసింది. తాప్సీ అలా ఎందుకు పెట్టిందో తెలిసిన వారు మాత్రం కిసుక్కున న‌వ్వుకున్నారు. 

కానీ తెలియ‌నివారు తెగ ట్రోల్ చేశారు. దీనికి తాప్సీ స్పందిస్తూ మీకు ఇందులో హాస్యం తెలియ‌కపోతే నేనేం చేయ‌లేను అని క‌రాఖండిగా చెప్పేసింది. ఇంత‌కీ ఆమె అన్న‌దాన్లో అర్థం ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగాకు బాగా తెలుసు.ఆ  మ‌ధ్య క‌బీర్‌సింగ్ చిత్రంలో హీరో, హీరోని కొట్టిన స‌న్నివేశాల‌ను గురించి సందీప్ మాట్లాడుతూ ''ప్రేమ‌లో కొట్టుకోవ‌డం, ముద్దుపెట్టుకోవ‌డం మామూలు ఎమోష‌న్సే'' అని అన్నారు. అప్పుడే సామాజిక మాధ్య‌మాల్లో ప‌లువురు సెల‌బ్రిటీలు అత‌ని మాట‌ల‌ను తిప్పికొట్టారు. వెంట‌నే అత‌ను వాళ్లు అర్థం చేసుకున్న భావంతో తాను ఏమీ అన‌లేద‌ని చెప్పాడు. కానీ అప్పుడు ఏమీ అన‌ని తాప్సీ, దాన్ని మ‌న‌సులో పెట్టుకుని ఇప్పుడు ట్వీట్ చేయ‌డం మాత్రం ఆమెలోని వ్యంగ్య‌మైన కోణానికి అద్దంప‌డుతోంద‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.

More News

మ‌ణిర‌త్నం 'పొన్నియిన్ సెల్వ‌న్‌' లో న‌య‌న‌తార‌!

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న పీరియాడిక్ చిత్రం `పొన్నియిన్ సెల్వ‌న్‌`. ఈ చిత్రం కోసం ఇప్ప‌టికే విక్ర‌మ్‌, ఐశ్వ‌ర్య‌రాయ్‌తో పాటు ప‌లువురు ఆర్టిస్టుల‌ను మ‌ణిర‌త్నం ఎంపిక చేశారు.

కొడుకును ఇబ్బంది పెట్టిన విక్ర‌మ్‌

చియాన్ విక్ర‌మ్ సినిమాల్లో బిజీ బిజీగా న‌టిస్తున్న త‌రుణంలోనే ఆయ‌న త‌న‌యుడు ధ్రువ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు.

'సాహో' షూటింగ్ పూర్తి..

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియేష‌న్స్ నిర్మాణంలో వంశీ, ప్ర‌మోద్ నిర్మాత‌లుగా రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం `సాహో`.

వైఎస్ జగన్‌కు ఝలక్.. బీజేపీలోకి జంపింగ్‌లు!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’‌కు తెరలేపిన సంగతి తెలిసిందే.

ఓ ఆట ఆడుకుంటున్న అంజ‌లి!

తెలుగు ప‌డుచు అంజ‌లి ఓ ఆట ఆడుకోవ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఎవ‌రితో... ఎవ‌రిని...? ఎందుకు? అని ఊపిరాగేట‌న్ని ప్ర‌శ్న‌లు వేసేయ‌వ‌ద్దు.