జర్నలిస్ట్ పాత్రలో సందీప్ హీరోయిన్...

  • IndiaGlitz, [Thursday,March 09 2017]

సందీప్ కిష‌న్‌తో ర‌న్ చిత్రంలో న‌టించిన అనీషా అంబ్రోస్ ఇప్పుడు మంచు మ‌నోజ్ చిత్రంలో న‌టిస్తుంది. గ‌తంలో అలియాస్ జాన‌కి చిత్రంలో న‌టించిన అనీషా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని అనుకున్నారు. కానీ తీరా అనీషా అంబ్రోస్‌కు ప‌వ‌న్ సినిమా అవ‌కాశం పోయింది. త‌ర్వాత సందీప్ కిష‌న్‌, ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ కాంబోలో చేసిన ర‌న్ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది.

అయితే ర‌న్ సినిమా ప్లాప్ కావ‌డంతో ఈ అమ్మ‌డుకి సినిమా అవ‌కాశాలు స‌న్నగిల్లాయి. తాజాగా ఇప్పుడు అనీషా అంబ్రోస్ మ‌నోజ్ ఎల్‌.టి.టి.ఇ ప్ర‌భాక‌ర‌న్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం ఒక్క‌డు మిగిలాడు. ఈ సినిమాలో అనీషా ఓ జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తుంది. ఈ నెలాఖ‌రున అనీషా షూటింగ్‌లో పాల్గొన‌నుంది. అజ‌య్ ఆండ్రూ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

More News

'16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్' నా కెరీర్ లో బెస్ట్ మూవీ : రహమాన్

బిచ్చగాడు వంటి సెన్సేషనల్ మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ బ్యానర్పై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో రెహమాన్, ప్రకాష్ విజయ్ రాఘవన్, అశ్విన్ కుమార్ తదితరులు తారాగణంగా కార్తీక్ నరేన్ దర్శకత్వంలో చదలవాడ పద్మావతి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `16 -ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్

మార్చి 17న 'ఏటీఎం వర్కింగ్' విడుదల

పవన్, కారుణ్య, రాకేష్, మహేంద్ర, నారాయణ, ఆషా, మహేశ్, అంబటి శీను, కిశోర్ దాస్, తిరుపతి దొరై, వీరబాబు, చిల్లర రాంబాబు, ఆంజనేయులు కీలక పాత్రల్లో నటించిన సినిమా `ఏటీఎం వర్కింగ్`. డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్, శ్రావ్య ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించారు.

ఘనంగా జరిగిన కోహినూర్-మహిళా శిరోమణి పురస్కారాలు

తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 8న అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా టెలివిజన్ పరిశ్రమలోని వివిధ శాఖలలో అమూల్య సేవలను అందిస్తున్న 18 మంది మహిళలను ఎంపిక చేసి 'కోహినూర్ మహిళా శిరోమణి' పురస్కారాలను అందించారు.

ఏప్రిల్ లో అన్ని భాషల్లో ఏక కాలంలో విడుదలకి సిధ్ధమవుతున్న '1971 - భారత సరిహద్దు'

ప్రతి సమస్యకి యుధ్ధం సమాధానం కాదు. యుధ్ధం లేని ప్రపంచాన్ని చూడాలనుకునే ఓ మేజర్ కథే ఈ 1971 భారత సరిహద్దు చిత్రం. 1971 వ సంవత్సరంలో పాకిస్తాన్కి, భారతదేశానికి మద్య జరిగిన యుధ్ధ నేపద్యంలో ఈ కథాంశం నడుస్తుంది.

పూరి కోసం సన్నిలియోన్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇషాన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `రోగ్`. జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్ పతాకంపై డా|| సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి నిర్మిస్తున్న డిఫరెంట్ లవ్ స్టోరీ త్వరలోనే విడుదలకు సిద్ధం కానుంది.