close
Choose your channels

సెప్టెంబ‌ర్ 17న ‘గ‌ల్లీరౌడీ’ విడుదల

Sunday, September 5, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

సెప్టెంబ‌ర్ 17న ‘గ‌ల్లీరౌడీ’ విడుదల

కోవిడ్ సెకండ్ వేవ్ ప్ర‌భావం కాస్త స‌ద్దుమ‌ణిగిన త‌ర్వాత థియేట‌ర్స్‌కు సినీ ప్రేక్ష‌కాభిమానులు వ‌స్తున్నారు. అయితే కోవిడ్ స‌మ‌యంలో ఇంటికే ప‌రిమిత‌మై థ్రిల్ల‌ర్స్‌, హార‌ర్‌, స‌స్పెన్స్ సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌ను ఎక్కువ‌గా చూసిన ఆడియెన్స్ ఓ ప‌క్కా హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేయాల‌ని అనుకుంటారన‌డంలో సందేహం లేదు. అలాంటి న‌వ్వుల విందు భోజ‌నాన్ని అందించ‌డానికి సెప్టెంబ‌ర్ 17న ‘గ‌ల్లీరౌడీ’ వ‌చ్చేస్తున్నాడు. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ అధికారికంగా పోస్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు.

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గ‌ల్లీరౌడీ’. బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట‌న్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మించారు. న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ను పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో నటించారు.

ఇష్ట‌ప‌డ్డ అమ్మాయిని సొంతం చేసుకోవ‌డానికి తానొక పెద్ద రౌడీన‌ని బిల్డ‌ప్ ఇచ్చిన ఓ యువ‌కుడు.. దాని కోసం ఎలాంటి పాట్లు ప‌డ్డాడు. ఆ క్ర‌మంలో ఎలాంటి కామెడీ క్రియేట్ అయ్యింద‌నే అంశంపై ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘గ‌ల్లీరౌడీ’ ప్రేక్ష‌కుల ముందుకు సెప్టెంబ‌ర్ 17న రాబోతున్నాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.