ఆగస్టు 27న 'సోని లివ్' ఓటీటీలో 'వివాహ భోజనంబు' స్ట్రీమింగ్

  • IndiaGlitz, [Thursday,August 19 2021]

కమెడియన్ సత్య హీరోగా నటించిన వివాహ భోజనంబు సినిమా 'సోని లివ్' ఓటీటీ లో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఆగస్టు 27 న ఈ సినిమా వరల్డ్ ప్రీమియర్ కాబోతోంది. సందీప్ కిషన్ నిర్మిస్తూ ఓ ప్రత్యేక పాత్రలో నటించిన వివాహ భోజనంబు సినిమాను వాస్తవ ఘటనల స్ఫూర్తితో రూపొందించారు దర్శకుడు రామ్‌ అబ్బరాజు. నూతన తార అర్జావీ రాజ్ నాయికగా నటించింది. ఆనంది ఆర్ట్స్, సోల్జర్స్ ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్, సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న ఓ పిసినారి యువకుడి కథను వినోదాత్మకంగా చూపించనుందీ సినిమా.

తెలుగులో కొత్త ఓటీటీ వేదికగా లాంఛ్ అవుతున్న 'సోని లివ్' ..తన తొలి చిత్రంగా వివాహ భోజనంబు ను ఆగస్టు 27న స్ట్రీమింగ్ చేయబోతోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ అయిన వివాహ భోజనంబు సినిమా ఓటీటీలో మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకుంటుందని 'సోని లివ్' ఆశిస్తోంది. లాక్ డౌన్ లో ఇంటి నిండా బంధువులు ఉండిపోతే ఓ పిసినారి పెళ్లి కొడుకు ఎలా ఇబ్బందులు పడ్డాడో ఆద్యంతం నవ్వించేలా వివాహ భోజనంబు సినిమాలో చూపించనున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ బోలెడన్ని నవ్వులు పంచింది. ఇక సినిమా కంప్లీట్ ఎంటర్ టైనర్ అవడం ఖాయమని తెలుస్తోంది.

సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయ శర్మ, టీఎన్ఆర్, వైవా హర్ష, శివన్నారాయణ, మధు మణి, నిత్య శ్రీ, కిరీటి, దయ, కల్ప లత తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - అనివీ, సినిమాటోగ్రఫీ - మణికందన్, ఎడిటింగ్ - ఛోటా కె ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ - బ్రహ్మ కడలి, కొరియోగ్రఫీ - సతీష్, విజయ్, కథ - భాను భోగవరపు, మాటలు - నందు ఆర్ కె, సాహిత్యం - కిట్టు, కృష్ణ చైతన్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సీతారాం, శివ చెర్రి, నిర్మాతలు - కేఎస్ శినీష్, సందీప్ కిషన్, దర్శకత్వం - రామ్ అబ్బరాజు.

More News

'జీ 5' ఒరిజినల్ మూవీ 'నెట్' టీజర్ విడుదల... అవికా గోర్ ఇంట్లో ఎవరున్నారు?

వివిధ భారతీయ భాషల్లో, వివిధ జానర్లలో సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ సినిమాలు, ముఖ్యంగా ఒరిజినల్ మూవీస్ అందిస్తూ...

మహేష్ బాబు చేతుల మీదుగా విడుదలైన సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’ ట్రైలర్..

సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా,

'సావిత్రి w/o సత్యమూర్తి' టీజర్ విడుదల

'దిస్ ఈజ్ సత్యం. క్లాస్ టచ్, మాస్ కటౌట్! ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకడు నాలాంటోడు' అని 'కేరింత' ఫేమ్ పార్వతీశం అంటున్నారు.

రెజీనా క‌సాండ్ర తాజా చిత్రం ‘నేనే నా’ షూటింగ్ పూర్తి

హీరోయిన్ రెజీనా కసాండ్ర లేటెస్ట్ మూవీ ‘నేనే నా’. ఈ సినిమా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ సినీ ఇండ‌స్ట్రీ స‌హా ప్రేక్ష‌కులంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్ ల 'డియర్ మేఘ' థియేటర్ రిలీజ్ కు రెడీ

మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్ ల ''డియర్ మేఘ'' సెప్టెంబర్ 3న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతోంది.