మ‌రోసారి నిరాశ‌ ప‌రిచిన సునీల్‌

  • IndiaGlitz, [Friday,September 15 2017]

హాస్య‌న‌టుడిగా ఫుల్ బిజీగా ఉన్న టైంలో క‌థానాయ‌కుడిగా ట‌ర్న్ అయ్యాడు సునీల్‌. ప్రారంభంలో మంచి విజ‌యాలే వ‌చ్చినా.. త‌న‌కు సూట్ కాని బాడీ లాంగ్వేజ్‌తో, కాన్సెప్ట్‌ల‌తో వ‌రుస‌గా ప‌రాజ‌యాల‌ను సొంతం చేసుకుంటున్నాడాయ‌న‌. పూల‌రంగ‌డు త‌ర్వాత సాలిడ్ హిట్ లేని సునీల్‌కి తాజా చిత్రం ఉంగ‌రాల రాంబాబు అయినా హిట్ చిత్రంగా నిలుస్తుందేమోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూశారు.

ఓన‌మాలు, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు లాంటి మంచి చిత్రాల‌ను రూపొందించిన క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌కుడు కావ‌డంతో క‌నీసం మంచి చిత్రంగానైనా పేరు తెచ్చుకుంటుందంటే.. ఇవాళ విడుద‌లైన ఉంగ‌రాల రాంబాబు స‌ర్వ‌త్రా నెగ‌టివ్ టాక్‌ని మూట‌గ‌ట్టుకుంది. మొత్తానికి ప్రేక్ష‌కుల‌ను మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు సునీల్‌.