అక్టోబర్‌ 7న సునీల్‌ ఈడు గోల్డ్‌ ఎహే

  • IndiaGlitz, [Tuesday,September 13 2016]

డాన్సింగ్‌ స్టార్‌ సునీల్‌, బిందాస్‌, రగడ, దూసుకెళ్తా చిత్రాల దర్శకుడు వీరు పోట్ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ఈడు గోల్డ్ ఎహే.ఎటివి సమర్పణలో ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ (ఇండియా) ప్రై. లిమిటెడ్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ...ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. అతి త్వరలోనే ఆడియో రిలీజ్‌ చేసి, అక్టోబర్‌ 7న విజయదశమి కానుకగా వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నాం. క్లాస్‌ని, మాస్‌ని అలరించే ఈ చిత్రం ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. సునీల్‌ కెరీర్‌కి, మా బేనర్‌కి ఈడు గోల్డ్‌ ఎహే మరో సూపర్‌హిట్‌ చిత్రమవుతుంది అన్నారు.

డాన్సింగ్‌ స్టార్‌ సునీల్‌ సరసన సుష్మారాజ్‌, రిచా పనయ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో జయసుధ, పునీత్‌ ఇస్సార్‌, డా|| నరేష్‌, అరవింద్‌, చరణ్‌, పృధ్వీ, పోసాని, బెనర్జీ, శత్రు, వెన్నెల కిషోర్‌, షకలక శంకర్‌, ప్రభాస్‌, భరత్‌, అనంత్‌, రాజా రవీంద్ర, లంబోదర, మాస్టర్‌ అక్షిత్‌, నల్లవేణు, గిరిధర్‌, సుదర్శన్‌, విజయ్‌, జోష్‌ రవి, పి.డి.రాజు, పవన్‌, గణేష్‌, కోటేశ్వరరావు, జగన్‌, సత్తెన్న, అవంతిక, బేబి యోధ, లలిత, లక్ష్మి, శ్రీలేఖ, అశోక్‌ తలారి మిగతా పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: దేవరాజ్‌, సంగీతం: సాగర్‌ ఎం. శర్మ, ఆర్ట్‌: వివేక్‌ అన్నామలై, ఫైట్స్‌: గణేష్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ గరికిపాటి, కో-ప్రొడ్యూసర్‌: అజయ్‌ సుంకర, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: వీరు పోట్ల.

More News

క‌ళ్యాణ్ రామ్, పూరి చేతుల మీదుగా అర‌కు రోడ్ లో ఆడియో విడుద‌ల‌

రాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్ జంట‌గా శేషాద్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం `అర‌కు రోడ్ లో`. వాసుదేవ్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రానికి మేకా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, బి.భాస్క‌ర్‌, వేగిరాజు ప్ర‌సాద రాజు, రామేశ్వ‌రి న‌క్కా లు నిర్మాతలు. రాహుల్ రాజ్, వాసుదేవ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాట‌ల‌ను సోమ‌వారం హైద‌రాబాద్‌లోని

రాంచ‌ర‌ణ్‌తో మ‌ణిర‌త్నం...?

మెగాప‌వ‌ర్‌స్టార్ రాంచ‌ర‌ణ్ హీరోగా ఇండియ‌న్ ఏస్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందనుంద‌ని గ‌తంలో వార్త‌లు వినిపించాయి. ఓకే బంగారం చిత్ర క‌థ‌నే మ‌ణిర‌త్నం రాంచ‌ర‌ణ్‌కు వినిపించాడ‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి.

వెంకీ నెక్ట్స్ మూవీ లేటెస్ట్ అప్ డేట్..!

విక్ట‌రీ వెంక‌టేష్ బాలీవుడ్ మూవీ సాలా ఖ‌ద్దూస్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది.

కొత్త ద‌ర్శ‌కుడితో నాని

వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న నేచుర‌ల్ స్టార్ నాని సెప్టెంబ‌ర్ 23న మ‌జ్నుతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది.

రామ్‌, రావిపూడి సినిమా లేన‌ట్టేనా...?

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ప‌టాస్‌, సుప్రీమ్ చిత్రాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నుంద‌నే విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ గుడ్డివాడి పాత్ర‌లో క‌నిపిస్తాన‌ని ట్విట్ట‌ర్‌లో కూడా చెప్పుకొచ్చాడు.