క్రైమ్ కామెడీ జోన‌ర్‌తో సునీల్‌?

  • IndiaGlitz, [Sunday,March 25 2018]

కామెడీ హీరో సునీల్  హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచిన చిత్రం 'పూలరంగడు'. ఈ చిత్రాన్ని వీరభద్రమ్‌ చౌదరి తెరకెక్కించారు. ల్యాండ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సునీల్ కామెడీతో పాటు యాక్షన్ స‌న్నివేశాల్లో కూడా బాగా న‌టించారు.

ఈ చిత్రం కోసం ఎంతో శ్రమించి.. ఆరుపలకల శరీర సౌష్టవాన్ని కూడా ట్రై చేశారు సునీల్‌. 2012లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆరు సంవత్సరాల విరామం త‌రువాత‌.. మళ్ళీ సునీల్, వీరభద్రమ్‌ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది.

గత చిత్రంలో యాక్షన్ కామెడీను పంచిన ఈ ద్వయం ఈసారి క్రైమ్ కామెడీ జోనర్‌లో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరభద్రమ్‌ ఓ కథను సిద్ధం చేసుకుని సునీల్‌కు వినిపించడం.. అది సునీల్‌కి నచ్చడంతో త్వరలో ఈ క్రైమ్ స్టోరీ పట్టాలెక్కనుంది.

అయితే.. ప్రస్తుతం కథకి తుది మెరుగులు దిద్దేప‌నిలో ఉన్నారు డైరెక్ట‌ర్‌. అంజి రెడ్డి ప్రొడక్షన్స్ పతాకంపై అంజి రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం.. ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. దీనికి సంబంధించి త్వరలో మరిన్ని విషయాలు వెలువడే అవకాశం ఉంది. ఎప్పటినుంచో విజయం కోసం ఎదురుచూస్తున్న సునీల్.. ఈ క్రైమ్ కామెడీ జోనర్‌తోనైనా విజయాన్ని అందుకుంటారేమో చూడాలి.

More News

రామ్ చిత్రంలో ర‌వితేజ క‌థానాయిక‌?

క‌థానాయ‌కుడు రవితేజ, ద‌ర్శ‌కుడు కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘నేల టికెట్టు’.

శ్ర‌ధ్ధా రూపంలో 'సాహో'కి కొత్త చిక్కులు

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, యువ ద‌ర్శ‌కుడు సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో’. బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్.. ప్రభాస్‌తో కలిసి తెరను పంచుకోనుంది.

తార‌క్‌, చ‌ర‌ణ్ ఇద్ద‌రి ఖాతాలోనూ..​

‘బాహుబలి’ సిరీస్‌తో తన దర్శకత్వ ప్రతిభను ప్రపంచం నలుమూలలా చాటిన దర్శకుడు రాజమౌళి.

'రంగస్థలం'.. డిజిలైట్ రైట్స్ అంత ప‌లికాయా?

1985 కాలం నాటి ప‌రిస్థితుల‌తో.. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథగా 'రంగస్థలం' చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు సుకుమార్.

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ కి శుభాకాంక్షలు తెలిపిన TFJA

టి. న్యూస్ ఎండి , తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్ రాజ్యసభ సభ్యులు గా ఎన్నికైన నేపథ్యంలో సాటి మీడియా మిత్రుడిని