close
Choose your channels

పూర్తి స్థాయి కామెడీ పాత్ర‌లో సునీల్‌

Tuesday, February 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పూర్తి స్థాయి కామెడీ పాత్ర‌లో సునీల్‌

క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన సునీల్‌కు రెండు, మూడు త‌ప్ప చెప్పుకునేంత విజ‌యాలు లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు. `అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌`తో పాటు `సిల్లీఫెలోస్` చిత్రంలో పూర్తిస్థాయి క‌మెడియ‌న్‌గా న‌టించాడు. ఇప్పుడు మ‌హేష్ `మహ‌ర్షి` చిత్రంలో కూడా మంచి పాత్ర‌నే చేస్తున్నాడు.

కాగా ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది కూడా సునీల్ కోసం ఓ ఫుల్‌లెంగ్త్ రోల్‌ను సిద్ధం చేశాడ‌ట‌. గోపీచంద్, సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో సినిమా తెర‌కెక్క‌నుంది.సినిమా ఇంకా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంది. అంతా ఒకే అయితే సినిమా గురించిన స‌మాచారం వెలువ‌డుతుంద‌ని టాక్‌. `గౌత‌మ్‌నంద‌` తర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రాబోయే చిత్రమిదే కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.