'మెట్రో' గీతామాధురి సాంగ్ ని లాంచ్ చేసిన సునీల్

  • IndiaGlitz, [Monday,February 20 2017]

ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై 'ప్రేమిస్తే', 'జ‌ర్నీ', 'పిజ్జా' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ల‌ను అందించిన‌ సురేష్ కొండేటి స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జ‌ని రామ్ నిర్మించిన సినిమా -'మెట్రో'. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న‌ చైన్ స్నాచింగ్‌ల‌ను కళ్ళకు కడుతూ.. తెర‌కెక్కించిన చిత్ర‌మిది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల‌లో మార్చి 3న విడుద‌ల చేస్తున్నారు.
ఇటీవ‌లే రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కి, పోస్ట‌ర్ల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌ఖ్యాత గాయ‌ని గీతామాధురి ఈ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. గీతామాధురి సాంగ్‌ని హీరో సునీల్ ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా సునీల్ మాట్లాడుతూ - ''మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాలి.. అన్న కాన్సెప్టుతో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని అంద‌రూ ఆద‌రించాలి. చాలా కొత్త పాయింటుతో, చైన్ స్నాచింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమాని తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా'' అన్నారు.

స‌మ‌ర్ప‌కుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ - ''గీతామాధురి త‌నే స్వ‌యంగా పాడి, త‌నే న‌టించిన పాట‌ను హీరో సునీల్ ఆవిష్క‌రించారు. ఇన్నాళ్లు తెర‌వెన‌క గీతామాధురి పాట‌లు వింటున్నాం. ఇప్పుడు తెర‌పై త‌ను క‌నిపించ‌బోతున్నారు. ఇంత‌వ‌ర‌కూ తెలుగు ఇండ‌స్ట్రీలో రాని కొత్త పాయింటుతో మంచి కాన్సెప్టుతో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 3న తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నాం'' అని తెలిపారు.

నిర్మాత ర‌జ‌నీ రామ్ మాట్లాడుతూ- ''చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుత‌మైన భావోద్వేగాల‌తో సాగే చిత్ర‌మిది. గౌత‌మ్ మీన‌న్, ఏ.ఆర్.మురుగ‌దాస్ వంటి ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు పొందిన చిత్ర‌మిది. గీతామాధురి సాంగ్‌ని హీరో సునీల్ ఆవిష్క‌రించినందుకు ధ‌న్య‌వాదాలు. మార్చి 3న రిలీజ‌వుతున్న ఈ చిత్రం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంద‌న్న న‌మ్మ‌కం ఉంది'' అన్నారు.

More News

సింగపూర్ సిరిమల్లి అంటున్న హంస...

యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్ పై

హీరోగా మారుతున్న నటుడు...

జ్యోతిలక్ష్మీ,ఘాజీ సహా పలు చిత్రాల్లో నటించిన యాక్టర్ సత్యదేవ్ ఇప్పుడు హీరోగా మారుతున్నాడు.

స్టైలిష్ లుక్ లో చైతు...

అక్కినేని నాగచైతన్య ఇప్పుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

బాలయ్య దర్శకుడు కన్ ఫర్మ్ అయినట్టే....

తన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణితో ఇటు ప్రేక్షకులు,అటు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్న నందమూరి బాలకృష్ణ 101 వ

అతిథి పాత్రలో రానా....

రీసెంట్ గా 'ఘాజీ' వంటి డిఫరెంట్ మూవీతో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న యంగ్ హీరో దగ్గుబాటి రానా