రీమేక్‌లో సునీల్ చేయ‌డం లేదా?

  • IndiaGlitz, [Wednesday,October 04 2017]

త‌మిళంలో మంచి విజ‌యాన్ని సాధించిన చతురంగ వేట్టై అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో సునీల్ హీరోగా న‌టిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమాలో సునీల్ న‌టించ‌డం లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. చ‌తురంగ వేట్టై ఒక థ్రిల్ల‌ర్ మూవీ. సీరియ‌స్ కోణంలో సాగుతుంది.

అయితే సునీల్ రీసెంట్ మూవీ ఉంగ‌రాల రాంబాబు చిత్రం సునీల్‌కు ఆశించిన స్థాయి ఫ‌లితాన్ని ఇవ్వ‌క పోవ‌డంతో ఇప్పుడు చ‌తురంగ వేట్టై సినిమా చేయాలా? వ‌ద్దా? అని ఆలోచించి వ‌ద్ద‌నే అనుకున్నాడ‌ట‌. ఇప్పుడు నిర్మాత‌లు మ‌రో హీరోను వెతికే ప‌నిలో బిజీగా ఉన్నార‌ట‌. క‌మెడియ‌న్ నుండి హీరోగా మారిన త‌ర్వాత సునీల్ హీరోగా కెరీర్ ప్రారంభంలో అందాల రాముడు, పూల‌రంగ‌డు, మ‌ర్యాద రామ‌న్న వంటి మంచి విజ‌యాల‌నే సాధించాడు. ఈ మ‌ధ్య కాలంలో సునీల్‌కు చెప్పుకోద‌గ్గ స‌క్సెస్ మాత్రం క‌న‌ప‌డ‌టం లేదు మ‌రి.

More News

చ‌ర‌ణ్‌తో స్పెష‌ల్ సాంగ్ బ‌న్ని హీరోయిన్‌...

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాలో బ‌న్నితో ఆడి పాడిన పూజా హెగ్డే ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రంలో న‌టిస్తుంది. ఈ సినిమాతో పాటు ఓ స్పెష‌ల్ సాంగ్‌లో చేయ‌నుండ‌టం విశేషం.

ప‌వ‌న్ 25..మూడు హ్యాట్రిక్స్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో జ‌ల్సా, అత్తారింటికి దారేది వంటి హిట్ చిత్రాల త‌రువాత మ‌రో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. అనిరుద్ సంగీత‌మందిస్తున్న ఈ చిత్రాన్ని సం

మారుతికి క‌లిసొచ్చిన సెంటిమెంట్‌

ఈ రోజుల్లో, బ‌స్‌స్టాప్‌, కొత్త జంట‌, భ‌లే భ‌లే మగాడివోయ్ వంటి వ‌రుస విజ‌యాల త‌రువాత ద‌ర్శ‌కుడు మారుతికి బాబు బంగారం రిజ‌ల్ట్‌ చిన్న షాక్ ఇచ్చింది. అయితే ఆ త‌రువాత వ‌చ్చిన మ‌హానుభావుడుతో మ‌ళ్లీ ఆయ‌న స‌క్సెస్ బాట ప‌ట్టారు. సెప్టెంబ‌ర్ 29న ద‌స‌రా కానుక‌గా విడుద‌లైన ఈ సినిమాకి తొలి ఆట నుంచే హిట్ టాక్ వ‌చ్చింది.

ర‌వితేజ సినిమాతో హ్యాట్రిక్ కొడ‌తారా?

నాని క‌థానాయ‌కుడుగా న‌టించిన కృష్ణగాడి వీర‌ప్రేమ‌గాథ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది పంజాబీ బ్యూటీ మెహ‌రీన్‌. ఆ  సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి రిజ‌ల్ట్‌ని సొంతం చేసుకుంది. ఆ త‌రువాత ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రం గ్యాప్‌తో వ‌చ్చిన ఆమె రెండో తెలుగు చిత్రం మ‌హానుభావుడు విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా విడుద‌లై విజ‌య‌ప‌థంలో ప‌య‌నిస్తోం

మెగాస్టార్ 'మాస్ట‌ర్‌' కి 20 ఏళ్లు

హిట్ల‌ర్‌తో సెకండ్ ఇన్నింగ్స్‌కి స‌క్సెస్‌ఫుల్‌గా శ్రీ‌కారం చుట్టిన మెగాస్టార్ చిరంజీవికి.. వెనువెంట‌నే ద‌క్కిన మ‌రో సూప‌ర్ స‌క్సెస్ మూవీ మాస్ట‌ర్‌. తెలుగు లెక్చ‌ర‌ర్‌గా చిరు న‌టించిన ఈ సినిమాకి తొలుత నెగ‌టివ్ టాక్ వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఇందులో చిరు లుక్‌, స్టైల్‌, డాన్స్‌లు ఆ టాక్‌ని అధిగ‌మించి సూప‌ర్ హిట్ వైపు న‌డిపించాయి.