close
Choose your channels

వ‌రుస సినిమాల‌ను ఓకే చేస్తున్న సునీల్‌....

Saturday, July 7, 2018 • తెలుగు Comments

వ‌రుస సినిమాల‌ను ఓకే చేస్తున్న సునీల్‌....

క‌మెడిన్ ట‌ర్న్ హీరోగా ఉన్న సునీల్ ఇప్పుడు మ‌ళ్లీ క‌మెడియ‌న్‌గా న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. అంటే హీరో స్నేహితుడి పాత్ర‌ల‌ను వ‌రుస‌గా చేస్తూ వ‌స్తున్నాడు. అల్ల‌రి న‌రేశ్‌తో `సిల్లీ ఫెలోస్‌`. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనిలో ర‌వితేజ‌తో.. ప‌డిప‌డి లేచె మ‌న‌సులో శ‌ర్వానంద్‌తో న‌టిస్తున్నాడు.

అలాగే సాయిధ‌ర‌మ్ తేజ్‌తో కిశోర్ తిరుమ‌ల చేయ‌బోయే చిత్ర‌ల‌హ‌రి బార్ అండ్ రెస్టారెంట్ సినిమాలో కూడా తేజ్ స్నేహితుడి పాత్ర‌లో న‌టించ‌డానికి సునీల్ ఎస్ చెప్పాడ‌ట‌. హీరోగా కంటే సునీల్ క‌మెడియ‌న్‌గా మంచి స్పీడు మీదున్నాడ‌ని.. వ‌రుస సినిమాలు చేస్తున్నాడ‌ని ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.