close
Choose your channels

తెరపైకి కేఏ పాల్ బయోపిక్.. హీరోగా సునీల్!

Wednesday, June 26, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెరపైకి కేఏ పాల్ బయోపిక్.. హీరోగా సునీల్!

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అందరికీ గుర్తుండే ఉంటారు. ఒక వేళ మరిచిపోదామనకున్నా మరవని సెలబ్రిటీ ఆయన. ఎండ నుంచి కాస్త ఉపశమనం అవుదామన్నా.. నవ్వు కోవాలన్నా యూట్యూబ్‌లోకి వెళ్లి పాల్ వీడియోస్..లేదా పాల్ కామెడీ అని కొడితే చాలు.. నవ్వుల ‘పాల్’ వీడియోస్ వచ్చేస్తాయ్.. చూసి కాస్త రిలీఫ్ అవ్వొచ్చు. అయితే ఇక నుంచి ఆ అవసరం మీకు అక్కర్లేదు.. ఎందుకంటే ఇప్పుడు ఏకంగా ఆయన బయోపిక్ వచ్చేస్తోండోయ్.

పాల్ కనపడుట లేదు!

ఎన్నికలకు ముందు ఎక్కడచూసిన కనిపించిన పాల్.. ఫలితాల తర్వాత అసలు ఆయన ఏమయ్యారో కూడా ఎవరికీ తెలియట్లేదు. సోషల్ మీడియా వేదికగా.. పాల్ కనిపించట్లేదని పెద్ద ఎత్తున బోర్డులు కూడా పెట్టి కొందరు నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే ఉన్నట్లుండి పాల్ బయోపిక్ వస్తోందని.. ఇప్పటికే హీరో సెలక్షన్ అన్నీ అయిపోయాట. త్వరలోనే షూటింగ్ జరగబోతోందని ఫిల్మ్‌నగర్‌లో పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. అయితే నిర్మాతలు ఎవరొచ్చినా రాకున్నా.. తనకు తానుగా సినిమా నిర్మించుకుకోవాలనే యోచనలో పాల్ ఉన్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు, హీరో ఎవరు!?

టాలీవుడ్‌లోని ఓ నూతన దర్శకుడు పాల్ బయోపిక్ తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా ఈ బయోపిక్‌లో కమెడియన్ సునీల్ .. పాల్ పాత్రను పోషించనున్నట్లు వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అంతేకాదండోయ్.. ఈ సినిమాలో ఒకరు కాదు ఏకంగా ఇద్దరు హీరోయిన్లను పెట్టి తెరకెక్కించాలని దర్శకుడు, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇంత వరకూ ఈ సినిమా వ్యవహారంపై పాల్ గానీ.. సునీల్ గానీ.. ఎవరూ రియాక్ట్ అవ్వలేదు. ఇంతకీ సినిమా ఉంటుందా లేకుంటే ఇవన్నీ పుకార్లుగానే మిగిలిపోతాయా..? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.