అందుకే...ట్విట్టర్ లో లేనంటున్న సునీల్...

  • IndiaGlitz, [Thursday,February 18 2016]

ఇప్పుడు ఎవ‌రికైనా ట్విట్ట‌ర్ - ఫేస్ బుక్ అకౌంట్ ఉంటుంది. అదే సినిమా హీరోల‌కైతే ఖ‌చ్చితంగా ఉంటుంది. వాళ్ల సినిమా విశేషాలు - వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ట్విట్ట‌ర్ - ఫేస్ బుక్ ద్వారా తెలియ‌చేస్తున్నారు. అంతే కాదు టీజ‌ర్ - ట్రైల‌ర్ ను కూడా ట్విట్ట‌ర్ లోనే రిలీజ్ చేస్తున్నారు. అయితే క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్ మాత్రం సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లో క‌న‌ప‌డ‌డం లేదు.
దీనికి కార‌ణం ఏమిట‌ని సునీల్ ని అడిగితే...ట్విట్ట‌ర్ లో అకౌంట్ నేను ఎప్పుడో స్టార్ట్ చేసాను. అలా స్టార్ట్ చేసానో లేదో ప‌ది వేల మంది ఫాలోవ‌ర్స్ వ‌చ్చేసారు. అయితే చిరంజీవి గారి పుట్టిన‌రోజు నాడు ఆయ‌న‌కి విషెస్ ట్విట్ట‌ర్ లో చెప్ప‌లేద‌ని న‌న్ను చిరంజీవి గారి ఫ్యాన్ కాద‌న్నాడు ఎవ‌రో ట్విట్ట‌ర్ లో. అప్పుడు చిరంజీవి గారు ట్విట్ట‌ర్ లో లేరు..ఇంటి ద‌గ్గ‌ర ఉన్నారు ఇంటికెళ్లి విషెస్ చెప్పేసి వ‌చ్చాను అని ట్విట్ట‌ర్ లో చెప్పాను. ట్విట్ట‌ర్ లో విషెష్ చెప్ప‌లేద‌ని న‌న్నుచిరు ఫ్యాన్ కాద‌న‌డంతో నాకు కోపం వ‌చ్చింది. ఇక అప్ప‌టి నుంచి ట్విట్ట‌ర్ ఆన్ చేయ‌డం మానేసాను అని చెప్పారు సునీల్. అది సునీల్ ట్విట‌ర్ లో క‌న‌ప‌డ‌క‌పోవడానికి కార‌ణం.

More News

స‌రైనోడు టీజ‌ర్ రిలీజ్

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - బోయపాటి శ్రీను కాంబినేష‌న్లో రూపొందిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌రైనోడు. ఏప్రిల్ లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న స‌రైనోడు టీజ‌ర్ ఈరోజు రిలీజ్ చేసారు.

మెగా బ్ర‌ద‌ర్స్ సెంటిమెంట్ ఫాలో అవుతున్న స‌ర్ధార్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. బాబీ తెర‌కెక్కిస్తున్న స‌ర్ధార్ షూటింగ్ చాలా స్పీడుగా జ‌రుగుతుంది.

నా గ‌త చిత్రాల‌న్నింటి కంటే కృష్ణాష్ట‌మి ప్రేక్ష‌కుల‌కు ఎక్కువ సంతృప్తి క‌లిగిస్తుంది ఇది నిజం. - హీరో సునీల్

అందాల రాముడు, పూల రంగ‌డు, మిస్ట‌ర్ పెళ్లికొడుకు, భీమ‌వ‌రం బుల్లోడు...చిత్రాల్లో న‌టించిన క‌మెడియ‌న్ ట‌ర్న‌డ్ హీరో సునీల్. వాసు వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో సునీల్ న‌టించిన తాజా చిత్రం కృష్ణాష్ట‌మి.

వరుణ్ తేజ్ న్యూమూవీ టైటిల్ ఇదే..

ముకుంద సినిమాతో హీరోగా పరిచయమై..కంచె సినిమాతో విమర్శకుల ప్రశంసలందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్.

రాం చరణ్ - సురేందర్ రెడ్డిల చిత్రం ప్రారంభం

వరుస సక్సెస్ ల తో దూసుకెళ్తున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా, ప్రతిష్టాత్మక చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన గీతా ఆర్ట్స్ బ్యానర్లో, స్టైలిష్ డైరెక్టర్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ చిత్రానికి శ్రీకారం చుట్టారు.