ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్: చంద్రబాబు


Send us your feedback to audioarticles@vaarta.com


ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. కనీసం 100 పడకలు ఉండేలా, గరిష్టంగా 300 పడకలతో ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయని స్పష్టం చేశారు.
ప్రస్తుతం 70 నియోజకవర్గాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయని, త్వరలోనే మిగతా 105 కోట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తామని తెలిపారు. సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు.. పీపీపీ మోడల్లో ఈ హాస్పిటల్స్ నిర్మిస్తమన్నారు.
నియోజకర్గాల్లో స్థలంపై రాయితీలు ఇస్తామని, వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పాటుచేయబోయే హాస్పిటల్స్ కు మరిన్ని రాయితీలు కల్పిస్తామని.. అలా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో వైద్యశాలలు ఏర్పాటవుతాయని అన్నారు.
ప్రజల్ని ప్రధానంగా వేధిస్తున్న 10 వ్యాధుల్లో ప్రతిదానికీ దేశ, విదేశాల్లో నిపుణులైన ప్రముఖుల్ని సలహాదారులుగా నియమిస్తామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న అత్యుత్తమ వైద్యుల్ని ఇంచార్జీలుగా నియమిస్తామని తెలిపారు చంద్రబాబు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments