close
Choose your channels

అదిరిపోయే బ్రొమాన్స్ ఖాయం

Friday, January 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అదిరిపోయే బ్రొమాన్స్ ఖాయం

వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన చిత్రం 'ఎఫ్ 2'. 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్' ట్యాగ్ లైన్. అనిల్ రావిపూడి దర్శకుడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న సినిమా విడుదలవుతుంది.

ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెంకటేష్ మాట్లాడుతూ "ఈ సంక్రాంతి పండుగకి ఎఫ్ 2 రావడం చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా పండగలకు వచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సంక్రాంతికి ఎఫ్2.. సంక్రాంతి అల్లుళ్లుగా వస్తున్నాం. కథ, దర్శకుడిని నమ్మి సినిమా చేశాను. చాలా నేచురల్‌గా చేశాను. అనీల్ కూడా చాలా ఫ్రీ డమ్ ఇచ్చి చేయించుకున్నాడు. వరుణ్‌తేజ్, రాజేంద్రసాద్‌గారితో కలిసి పనిచేయడం ఆనందంగా అనిపించింది. తమన్నా, మెహరీన్ వండర్ వర్క్ చేశారు." అన్నారు.

వరుణ్‌తేజ్ మాట్లాడుతూ "ఫస్ట్ టైం ఓ మాస్ క్యారెక్టర్ చేశాను. కామెడీ క్యారెక్టర్. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది.. ఎప్పుడు అయిపోయిందో తెలియడం లేదు. ఈ జర్నీ నాకు మెమొరబుల్‌గా ఉండిపోతుంది. ఆయన నా జర్నీ ఓ నటుడిగా ప్రారంభమై, బ్రదర్‌లా మారింది. ఈ సినిమాతో అనిల్‌లాంటి మంచి ఫ్రెండ్ దొరికినందుకు ఆనందంగా ఉంది. దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్‌గారితో ఫిదా చేశాం. మా పెద్దనాన్నగారి కాన్‌టెంపరరీ హీరో వెంకటేష్‌గారితో సినిమా చేయాలంటే ఎక్కడో చిన్న భయం ఉండేది. కానీ ఆయన మాతో చాలా కంఫర్ట్‌గా ఉన్నారు. ఫ్రెండ్‌లా, మెంటర్‌లా మాతో ఉన్నారు. నెక్స్‌ట్ టైం ఆయనతో స్టోరీ కూడా అడగకుండానే సినిమా చేయడానికి నేను రెడీ. ఈ సినిమాలో మా ఇద్దరి బ్రోమాన్స్ అద్భుతంగా ఉండబోతోంది. " అన్నారు.

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ "ఓ సినిమా సిద్ధం అవ్వడానికి 24 క్రాఫ్ట్స్ కష్టం ఉండాల్సిందే. ఈ సినిమాకీ మేమంతా అలానే కష్టపడ్డాం’’ అన్నారు. ఇంకా  ఈ కార్యక్రమంలో తమన్నా, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్, శిరీష్ తదితరులు పాల్గొన్నారు. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.