దీపావ‌ళికి సూప‌ర్ స్టార్ వ‌చ్చేస్తున్నాడు..!

  • IndiaGlitz, [Friday,October 14 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - క్రేజీ డైరెక్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ లో దాదాపు 100 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుంది. ఇటీవ‌ల హైద‌రాబాద్ లో కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఆత‌ర్వాత చెన్నైలో కొన్నియాక్ష‌న్ సీన్స్ చిత్రీక‌రించారు. డిసెంబ‌ర్ కి షూటింగ్ మొత్తం పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రానికి వాస్కోడిగామా, ఎనిమీ, అభిమ‌న్యుడు ఇలా కొన్ని టైటిల్స్ ప్ర‌చారంలో ఉన్నాయి. అయితే...ప్ర‌చారంలో ఉన్న టైటిల్స్ కాద‌ని...ఇంకా ఏ టైటిల్ క‌న్ ఫ‌ర్మ్ చేయాలేద‌ని గ‌తంలో ప్ర‌క‌టించారు. ఇదిలా ఉంటే...దీపావ‌ళికి ఈ మూవీ టీజ‌ర్ రిలీజ్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. టీజ‌ర్ తో పాటు టైటిల్ కూడా ఎనౌన్స్ చేస్తారంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి...ప్ర‌చారంలో ఉన్న‌ట్టుగా దీపావ‌ళికి సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ కి టీజ‌ర్ తో ట్రీట్ ఇస్తాడేమో చూడాలి..!

More News

సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణలో 'లక్కున్నోడు'

'ఈడోరకం-ఆడోరకం' వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత విష్ణు మంచు హీరోగా,బబ్లీ బ్యూటీ హన్సిక హీరోయిన్ గా

పెళ్లిచూపులు హీరో ద్వారక ఆడియో తేదీ ఖ‌రారు..!

పెళ్లిచూపులు సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న తాజా చిత్రం ద్వారక‌. నూత‌న ద‌ర్శ‌కుడు  శ్రీనివాస్ ర‌వీంద్ర  (ఎం.ఎస్.ఆర్) ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

శృతి...అదిరింది అంటున్నదేవి..!

అందాల తార శృతిహాస‌న్ త‌న ఆలోచ‌న‌ల‌కు బి ది బిట్చ్ అంటూ వీడియో రూపం ఇచ్చింది. నా ఇష్టం వ‌చ్చిన‌ట్లు బ‌త‌క‌డ‌మే బిట్చ్ అనిపిస్తే అలా పిలిపించుకోవ‌డానికి నాకు ఎలాంటి అభ్యంత‌రం లేదు అంటుంది శృతి.

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న 'ధృవ'

మెగాపవర్స్టార్ రామ్చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ప్రతిష్టాత్మకమైన గీతాఆర్ట్స్ బ్యానర్ లో, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రెస్టిజియస్ మూవీ `ధృవ` మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా గీతాఆర్ట్స్ బ్యానర్లో `మగధీర` తర్వాత రూపొందుతోన్న ఈ స్టైలిష్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రీకరణ దశలో ఉంది.

అందుకే....నేను కామెంట్స్ ను పట్టించుకోను - శృతిహాసన్

అనగనగా ఓ థీరుడు,ఓ మై ఫ్రెండ్,గబ్బర్ సింగ్,బలుపు,ఎవడు,రేసుగుర్రం...తదితర చిత్రాల్లో నటించి మెప్పించిన అందాల తార శృతిహాసన్.