close
Choose your channels

టెన్షన్‌కు తెర తీసిన సూపర్‌స్టార్‌

Sunday, November 29, 2020 • తెలుగు Comments

టెన్షన్‌కు తెర తీసిన సూపర్‌స్టార్‌

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ మరోసారి టెన్షన్‌ను క్రియేట్‌ చేశారు. ప్రజలకు, అభిమానులకు మాత్రం కాదు..ప్రత్యర్థి పార్టీలకు మాత్రమే. ఎందుకంటే చాలా రోజులుగా రజినీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీపై ఏదో రకంగా సోషల్‌ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన తలైవా. ఎప్పుడు వస్తాననే వివరాలను మాత్రం వెల్లడించలేదు. కానీ రావాల్సిన సమయంలో తప్పకుండా వస్తానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. రజినీకాంత్ మాటలు చెబుతున్నారే కానీ.. ఎలాంటి అనౌన్స్ మెంట్ చేయడం లేదని అందరూ అనుకుంటన్నారు. మరోవైపు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో రజినీ అభిమానుల్లో ఆతృత నెలకొంది.

ఈ నేపథ్యంలో తలైవా సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు తన అభిమాన సంఘాల నాయకులతో సమావేశం కానున్నారట. ఇప్పటికే వారికి ఆహ్వానాలు అందాయని సమాచారం. రేపు తలైవా పొలిటికల్‌ ఎంట్రీపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తమిళనాడు వర్గాల సమాచారం. అయితే రజినీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశం అనేది ఇతర రాజకీయ పార్టీలకు సమస్యను కలిగించేదే. ఆయన అభిమానులకు మాత్రం రజినీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలనే కోరుకుంటున్నారు. రజినీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే టెన్షన్ మాత్రం ఇతర రాజకీయ పార్టీల్లో నెలకొంది.

Get Breaking News Alerts From IndiaGlitz