అభిమానుల సమక్షంలో సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు వేడుక

  • IndiaGlitz, [Friday,June 01 2018]

సాహసాల సహవాసి.. తెలుగు సినీ ఖ్యాతికి చెరగని చిరునామా. పద్మభూషణ్‌, డా. సూపర్‌స్టార్‌ కృష్ణ. 'తేనె మనసులు' చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమై అశేష ప్రేక్షకాభిమానాన్ని ఏర్పరచుకున్న నటశేఖరుడు. 50 సంవత్సరాలుగా అలుపెరుగని శ్రామికునిలా సినీ జగత్తులో 350 చిత్రాలకు పైగా నటించి సరికొత్త రికార్డులను నెలకొల్పడం సూపర్‌స్టార్‌ కృష్ణకే శ్రీసాధ్యం. ఆయన 76వ జన్మదినోత్సవ వేడుకలు మే 31న హైదరాబాద్‌ మహేశ్వరంలో అభిమానులు, పద్మాలయా స్టూడియో సిబ్బందిల మధ్య అట్టహాసంగా జరిగాయి.

ఈ పుట్టినరోజు మహోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి అభిమానులు తరలివచ్చి సూపర్‌స్టార్‌ కృష్ణగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్‌ కృష్ణ, శ్రీమతి విజయనిర్మల, ప్రముఖ నిర్మాతలు ఆదిశేషగిరిరావు, కె.ఎస్‌. రామారావు, సి.కళ్యాణ్‌, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్‌. శంకర్‌ పాల్గొన్నారు. భారీగా ఏర్పాటు చేసిన భారీ కేక్‌ కటింగ్‌ అనంతరం...

సూపర్‌స్టార్‌ కృష్ణ మాట్లాడుతూ - ''నేను సినిమాలు చేసినా, చేయకపోయినా అటు ఇండస్ట్రీ, ఇటు అభిమానులు ఎంతోమంది వచ్చి బర్త్‌డే శుభాకాంక్షలు తెలపడం చాలా సంతోషంగా వుంది. ఈ సంవత్సరం ఏ సినిమా చెయ్యలేదు. అయినా పెద్ద ఎత్తున అంబరాన్నంటిన ఉత్సాహంతో అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు. వచ్చే సంవత్సరం మరింత గ్రాండ్‌గా పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి'' అన్నారు.

శ్రీమతి విజయనిర్మల మాట్లాడుతూ - ''చాలా దూరాల నుండి అభిమానులు అంతా వచ్చి కృష్ణగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు చాలా చాలా థాంక్స్‌'' అన్నారు.

క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌. రామారావు మాట్లాడుతూ - ''నా చిన్నప్పుడే సూపర్‌స్టర్‌ కృష్ణగారు 'జేమ్స్‌బాండ్‌', కౌబాయ్‌వంటి ఎన్నో సాహస చిత్రాలు తీసి అనేక ఎక్స్‌పెరిమెంట్స్‌ చేశారు. హీరోగానే కాకుండా దర్శకుడిగా నిర్మాతగా స్టూడియో అధినేతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. హీరోగా ట్రెండ్‌ సెట్‌ చేశారు. నిర్మాతలందరికీ ఒక మార్గదర్శకంగా నిలుస్తూ సినిమా స్కోప్‌, 70 ఎం.ఎం. ప్రత్యేకమైన సాంకేతిక విలువలతో సినిమాలు తీశారు కృష్ణగారు. 'అల్లూరి సీతారామరాజు', 'మోసగాళ్ళకు మోసగాళ్ళు' వంటి గొప్ప చిత్రాలు ఎన్నో తీశారు.

సూపర్‌స్టార్‌ కృష్ణగారి ఫ్యాన్‌ అయిన నేను నిర్మాతగా ఎదిగాను. 79లో ఆయన సినిమాకి శ్రీధర్‌గారి వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాను. విజయనిర్మలగారు చికెన్‌ కర్రి, పెరుగు అమెరికాలో రెడీ చేసి పెట్టేవారు. అప్పట్నుంచీ కృష్ణగారిని ఫాలో అవుతున్నాను. ఆయన ఎంతటి గొప్పవారో, గొప్ప వ్యక్తి అనేది నేను గమనిస్తున్నాను. ఆయన రాజకీయాల్లోకి వెళ్ళారు. కానీ మళ్ళీ విరమించుకున్నారు. ఆయన లేని లోటు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తుంది. అలాంటి సాహసాలు చేసే మంచి మనిషి సి.ఎం.గా లేని లోటు కన్పిస్తుంది'' అన్నారు.

ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ - ''కృష్ణగారు అభిమానులకి సూపర్‌స్టార్‌ కావచ్చు. కానీ నిర్మాతలకు ఆయన దేవుడు. నాకు వున్న ఎక్స్‌పీరియన్స్‌ ప్రకారం అలాంటి మంచి మనసున్న మనిషి ఇప్పటివరకు పుట్టలేదు. పుడతారో లేదో తెలీదు. నిర్మాతల కష్టసుఖాల గురించి ఆలోచించే ఏకైక హీరో కృష్ణ. సినిమాలు, స్టూడియో అంటే ఎంత ఇష్టమో అభిమానులు అంటే అంతకంటే ఎక్కువ ఇష్టం. అందుకే స్టూడియోలో అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు. ఆయన ఇంటి నుండి ఇంకా హీరోలు వస్తూనే వుండాలి. వాళ్ళందర్నీ కృష్ణగారి మనసు వుండేలా తీర్చిదిద్దాలి'' అన్నారు.

దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్‌. శంకర్‌ మాట్లాడుతూ - ''తెలుగు సినిమా రంగానికి కొత్త వెలుగులు అద్ది.. సూపర్‌స్టార్‌ అనే పదానికి సరికొత్త అర్థం చెప్పిన కృష్ణగారు కోట్లాదిమంది అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 'అల్లూరి సీతారామరాజు' సినిమా చూసి కృష్ణగారికి వీరాభిమానిని అయ్యాను. ఆయన ఆశీస్సులతో దర్శకుడ్ని కాగలిగాను. మంచి మనసున్న సూపర్‌స్టార్‌ కృష్ణగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు'' అన్నారు.

అనంతరం రేపల్లె ఘట్టమనేని యువత సూపర్‌స్టార్‌ కృష్ణ పోస్టర్‌ స్టాంపుని రిలీజ్‌ చేశారు. సూపర్‌స్టార్‌ కృష్ణ - మహేశ్‌ సేన రాష్ట్ర అధ్యక్షులు దిడ్డి రాంబాబు, ఆలిండియా కృష్ణ - మహేశ్‌ ప్రజా సేన అధ్యక్షుడు ఖాదర్‌ ఘోరి, రేపల్లె రవికృష్ణ, రామకృష్ణ, ఫణిబబ్బ, బాబీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More News

యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న డాక్టర్ సత్యమూర్తి - నిర్మాత డి.వెంకటేష్

యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల చేస్తున్నారు డి.వెంకటేష్.

అల్లు శిరీష్ సరసన హీరోయిన్ గా రుక్షార్ థిల్లాన్

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించగా... సూపర్ డూపర్ హిట్టయిన ఎబిసిడి (అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్ డ్ దేసి ) చిత్రాన్ని తెలుగులో అల్లు శిరీష్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ర‌వీంద్ర‌భార‌తిలో నటుడు ఉత్తేజ్ కుమార్తె చేత‌న ఉత్తేజ్ 'నాయిక‌', 'అనంత‌' నాట్య కళా రూపాల ప్ర‌ద‌ర్శ‌న‌

గురువారం సాయంత్రం  హైద‌రాబాద్ ర‌వీంద్ర భార‌తిలో  భాషా సంస్కృతి శాఖ  ఆధ్వ‌ర్యంలో సినీ న‌టుడు, ర‌చ‌యిత ఉత్తేజ్ కుమార్తె చేత‌న ఉత్తేజ్ `అష్ట‌విధ‌నాయిక`

ప్రపంచవ్యాప్తంగా జూలై 5న నారా రోహిత్, జగపతిబాబు 'ఆటగాళ్ళు'

ఫ్రెండ్స్‌ మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై నారా రోహిత్‌, జగపతిబాబు నటిస్తోన్న సినిమా ‘ఆటగాళ్ళు’. 'ఆంద్రుడు' చిత్ర దర్శకుడు  పరుచూరి మురళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ చిత్ర షూటింగ్ లో పాల్గొన్న కాజల్ అగర్వాల్

యువ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా పలు సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా