ఆస్పత్రిలో చేరిన సూపర్‌స్టార్ రజనీకాంత్.. అభిమానుల్లో టెన్షన్..!!

సూపర్‌స్టార్ రజనీకాంత్ చెన్నైలోని కావేరీ హాస్పిటల్లో చేరారు. ఆయన సన్నిహిత వర్గాల కథనం ప్రకారం... రజనీకాంత్ రొటీన్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చారని సమాచారం. అయితే, ఆయన రాత్రి కూడా వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటారా లేదా అన్నది తెలియరాలేదు. కావేరీ హాస్పిటల్ తరఫున ఇంత వరకూ ఎటువంటి అధికారిక ప్రకటన రావాల్సి వుంది. భారతీయ సినీ రంగంలో అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న కొన్ని రోజుల్లోనే ఆయన ఆస్పత్రిలో చేరడంతో.. అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

కాగా.. దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్న రజనీకాంత్‌‌ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్, గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి అభినందనలు తెలియజేశారు. గత సోమవారం ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో నటుడు రజనీకాంత్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శాలువాతో సత్కరించి దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారాన్ని అందజేశారు.

ప్రస్తుతం రజనీకాంత్, శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘‘అన్నాత్తే’’ .. దీనిని తెలుగులో ‘‘పెద్దన్న’’గా విడుదల చేయనున్నారు. నారాయణ్ దాస్ కె నారంగ్, డి సురేశ్ బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను దీపావళీ కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో సూపర్‌స్టార్ సరసన నయనతార ఆడిపాడనున్నారు. కిర్తీ సురేశ్.. రజనీకాంత్‌‌కు చెల్లెలిగా నటిస్తున్నారు. ఆయన మరదలిగా ఖుష్బు, కోడలిగా మీనా కనిపించారు. ప్రకాశ్ రాజ్, జగపతి బాబు, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.

More News

ఘణంగా జరిగిన 'ఓ మధు' ప్రి రిలీజ్ ఈవెంట్

బేబీ ఆస్కా సమర్పణలో మ్యాక్ కింగ్ క్రియేషన్స్ పతాకంపై అబ్రార్ ఖాన్, ఐశ్వర్య జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో

ఆకాష్ కు రొమాంటిక్ ఒక ఇడియట్ లాంటి సినిమా అవుతుంది - పూరి జగన్నాథ్

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబోలో వస్తోన్న ‘రొమాంటిక్’ చిత్రం అక్టోబర్ 29 విడుదల కాబోతోంది.

పెళ్లి పీటల ముందు వరకూ జరిగే కథ ఇది - నాగశౌర్య

పెద్దస్టార్‌ కావడానికి 5 వరస హిట్లు కావాలి. నాకు ఉన్న పెద్ద హిట్‌ ‘చలో’. ఇంకా నాలుగు కావాలి.

బిగ్‌బాస్ 5 తెలుగు: టాస్క్ నుంచి తప్పుకున్న జెస్సీ.. వెదవల్ని చేస్తున్నాడన్న షణ్ముఖ్, సిరికి హగ్

బిగ్‌బాస్ 5 తెలుగు 53వ ఎపిసోడ్‌‌లో కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా హౌస్‌మేట్స్ మధ్య చిన్న చిన్న గొడవలు చోటు చేసుకున్నాయి.

ముంబైలో పూజా హెగ్డే కొత్త ఇల్లు.. పనుల్ని దగ్గరుండి చూసుకుంటోన్న బుట్టబొమ్మ.. !!

సామాన్యులైనా, సెలబ్రెటీలైనా సొంతంగా ఇల్లు కట్టుకోవాలన్నది కల. ఎవరీ స్తోమతకు తగ్గట్టు వారు డ్రీమ్ హౌస్‌ను నిర్మించుకుంటారు.