close
Choose your channels

తమిళ స్టార్ హీరోతో వంశీ పైడిపల్లి నెక్ట్స్ సినిమా..

Tuesday, May 4, 2021 • తెలుగు Comments

తమిళ స్టార్ హీరోతో వంశీ పైడిపల్లి నెక్ట్స్ సినిమా..

‘ఊపిరి’, ‘మహర్షి’ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు వంశీ పైడిపల్లి. హడావుడిగా సినిమాలు చేసెయ్యకుండా అద్భుతమైన సినిమాలను కాస్త గ్యాప్ తీసుకుని మరీ అందిస్తుంటారు. ‘మహర్షి’ జాతీయ అవార్డులను సైతం గెలుచుకోవడంతో దర్శకుడిగా వంశీ పైడిపల్లి రేంజ్ మరింత పెరగింది. ఆయన నెక్ట్స్ సినిమా ఎవరితో చేయనున్నారనే ఆసక్తి పెరిగింది. అయితే తమిళ స్టార్ హీరో విజయ్‌తో వంశీ పైడిపల్లి తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారని టాక్. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని దిల్ రాజు రూపొందించనున్నారని ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నారు. .

Also Read: అటు పవర్ స్టార్.. ఇటు సూపర్ స్టార్‌తో నిధి..

విజయ్ 66వ చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. విజయ్ ప్రస్తుతం తన 64, 65 చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు..  ‘మాస్టర్‌’ తీసిన ‘ఖైదీ’ ఫేమ్‌ లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఒకటి, అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్ వచ్చే ఏడాది నాటికి పూర్తి చేసుకుని.. వంశీ పైడిపల్లితో చేయనున్న సినిమాను వెంటనే సెట్స్‌ మీదకు తీసుకెళతారని సమాచారం. ఇటీవలే చెన్నైలో హీరోను కలిసిన దర్శకుడు ఓ స్ర్కిప్ట్‌ వినిపించారట. అది నచ్చడంతో సినిమా చేస్తానని విజయ్‌ చెప్పారట.

తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా సినిమాగా దీనిని రూపొందించాలని వంశీ పైడిపల్లి భావిస్తున్నారట. నిజానికి ‘మహర్షి’ తర్వాత మరోసారి మహేశ్‌బాబుతో సినిమా చేయాలని వంశీ పైడిపల్లి సిద్ధమయ్యారు. అయితే, కథపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అనూహ్యంగా సినిమాను పక్కనపెట్టారు. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌కు వంశీ కథ చెప్పారనే టాక్ వినిపించింది. చివరకు విజయ్‌తో మూవీ సెట్ అయింది. ఇటీవల తెలుగు మార్కెట్‌పై ఈ తమిళ హీరో దృష్టి పెట్టారు. తెలుగులో కొన్ని విజయాలను సైతం అందుకున్నారు. అయితే ఇప్పటి వరకూ నేరుగా తెలుగు సినిమా ఏదీ విజయ్ చేయలేదు. వంశీ పైడపల్లితో చేయబోయేది విజయ్‌ స్ట్రయిట్‌ తెలుగు సినిమా కానుంది.

Get Breaking News Alerts From IndiaGlitz