3 నెలల గ్యాప్ లో సూపర్ స్టార్ 2 సినిమాలు

  • IndiaGlitz, [Thursday,September 14 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమాలంటే.. త‌మిళంలోనే కాదు తెలుగు, హిందీ ప్రేక్ష‌కుల‌కు కూడా ఆస‌క్తి ఎక్కువ‌. గ‌తేడాది విడుద‌లైన క‌బాలి నిరాశ‌ప‌రిచినా.. ర‌జ‌నీ త‌దుప‌రి చిత్రం 2.ఓ పై భారీ అంచ‌నాలే ఉన్నాయి. శివాజీ, రోబో చిత్రాల త‌రువాత శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ 2.ఓలో ఎమీ జాక్స‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టించాడు.

ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించిన ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని జ‌న‌వరి 25న భారీ ఎత్తున విడుద‌ల చేయ‌బోతున్నారు. 2.ఓ విడుద‌లైన 3 నెల‌ల‌కే సూప‌ర్‌స్టార్ మ‌రో చిత్రం కాలా విడుద‌ల కాబోతోంది. క‌బాలి ద‌ర్శ‌కుడు పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాని ఏప్రిల్లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. హ్యూమా ఖురేషి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ర‌జ‌నీ అల్లుడు, ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు ధ‌నుష్ నిర్మిస్తున్నారు. ఏదేమైనా.. ర‌జ‌నీ అభిమానుల‌కు వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థం పండ‌గే.