రాహుల్.. జాగ్రత్త అంటూ సుప్రీం హెచ్చరిక

  • IndiaGlitz, [Thursday,November 14 2019]

కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు ఒకింత సూచనలు, సలహాలు కూడా చేసింది. ‘మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.. భవిష్యత్‌లో సంయమనం పాటించాలి’ అని కోర్టు హెచ్చరించింది. అసలేం జరిగింది అనే వివరాల్లోకెళితే.. గురువారం నాడు సుప్రీం కోర్టులో రాఫెల్ ఒప్పందంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో రాఫెల్‌పై కోర్టు పర్యవేక్షణలో విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది. ముందు నుంచి రక్షణ వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోదని చెబుతూ వస్తున్న సుప్రీం.. నేటి తీర్పులోనూ ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. దీంతో కోర్టు ధిక్కరణ కేసులో రాహుల్‌‌కు ఊరట లభించింది.

ప్రధాని మోదీని ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అంటూ రాహుల్‌ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న బీజేపీ.. వీటిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మీనాక్షి కోర్టు ధిక్కరణ కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం రాహుల్‌ గాంధీని హెచ్చరించింది. ఈ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యలకు రాహుల్‌ క్షమాపణలు చెప్పారు. ఆయన క్షమాపణలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. సుప్రీం కోర్టు చీవాట్లతో ఇకనైనా రాహుల్ మారుతాడో లేకుంటే మునుపటి లాగా ఉంటారో వేచి చూడాల్సిందే.

More News

'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి' ఫస్ట్‌ లుక్‌ విడుదల

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా

'అల వైకుంఠపురంలో..' నుంచి రేపు మరో స్పెషల్ సర్‌ప్రైజ్!

టాలీవుడ్ యంగ్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హేగ్దే నటీనటులుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో..’.

కొత్త షెడ్యూల్‌లో శ‌ర్వానంద్ 'శ్రీకారం'

శ‌ర్వానంద్ హీరోగా రూపొందనున్న చిత్రం `శ్రీకారం`. 14రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై కిషోర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ ఏడాది ఆగ‌స్ట్ నుండి సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

రానా సినిమా డైరెక్ట‌ర్‌, కెమెరామెన్ మ‌ధ్య గొడ‌వ‌ ?

సాధార‌ణంగా సినిమా మేకింగ్‌లో స్టార్స్‌, టెక్నీషియ‌న్స్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధ‌లు రావ‌డ‌మ‌నేది కామ‌న్‌గానే జ‌రుగుతుంటాయి. అయితే అవి అప్ప‌టి వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌వుతూ ఉంటాయి.

ఫ్యాన్సీ రేటుకు `స‌రిలేరు నీకెవ్వ‌రు` డిజిట‌ల్‌, శాటిలైట్ హ‌క్కులు

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 26వ చిత్రం `సరిలేరు నీకెవ్వ‌రు`. అనిల్ రావిపూడి దర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతుంది. సినిమా ఇప్పుడు తుది ద‌శ చిత్రీక‌ర‌ణ‌కు చేరుకుంది. కాగా..