Sai Tej: సుప్రీమ్ హీరో సాయి తేజ్ కొత్త చిత్రం ప్రారంభం

  • IndiaGlitz, [Saturday,December 03 2022]

సుప్రీమ్ హీరో సాయి తేజ్ క‌థానాయ‌కుడిగా ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన‌ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర‌ ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాత‌గా కొత్త చిత్రం శుక్ర‌వారం లాంఛ‌నంగా ప్రారంభమైంది. జ‌యంత్ పానుగంటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ముహూర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత బాపినీడు భోగ‌వ‌ల్లి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో సాయి తేజ్ క్లాప్ కొట్టారు. హీరో సాయి తేజ్ అమ్మ‌గారు విజ‌య దుర్గ‌, నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌తీమ‌ణి విజ‌య ల‌క్ష్మి పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. బుచ్చి బాబు సానా స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌ బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ గారు మాట్లాడుతూ ‘‘సాయి తేజ్‌తో మా నిర్మాణ సంస్థ‌కు ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంది. అదే అనుబంధంతో ఇప్పుడు ఆయ‌న మా బ్యాన‌ర్‌లో మ‌రో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి జ‌యంత్ పానుగంటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు మెచ్చేలా సినిమాను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. త్వరలోనే సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేస్తాం’’ అన్నారు.

More News

పెళ్లికి ముందు శృంగారం.. ఏడాది జైలుశిక్ష , భారీ జరిమానా ..

పెళ్లికి ముందు శృంగారం ... ఇప్పటికీ సమాజాన్ని వేధిస్తోన్న ప్రశ్న. పాశ్చాత్య దేశాల్లో ఇది సర్వ సాధారణమే అయినా భారత్ వంటి కట్టుబాట్లు వున్న మనదేశంలో ఇది చట్టవిరుద్ధం.

BiggBoss: టాప్ నుంచి లాస్ట్‌కి పడిపోయిన ఆదిరెడ్డి... శ్రీహాన్- రేవంత్‌ల మధ్య ఫైనల్

బిగ్‌బాస్ 6 తెలుగు చివరి అంకానికి చేరుకుంది. మరో రెండు వారాల్లో విన్నర్ ఎవరో తేలిపోనున్నాడు.

Neelima Guna: గుణ శేఖర్ కుమార్తె వివాహ వేడుకలో మెగాస్టార్, ఇతర సినీ ప్రముఖులు

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ శేఖ‌ర్‌ కుమార్తె, శాకుంత‌లం మూవీ ప్రొడ్యూస‌ర్ అయిన‌ నీలిమ గుణ వివాహం డిసెంబ‌ర్‌ 2 రాత్రి 12 గంట‌ల 31 నిమిషాల‌కు

బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు ప్రభాస్.. ఫ్యాన్స్‌కి పండగే!

నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’లో ప్రసారమైన ‘అన్‌స్టాపబుల్’ సీజన్ వన్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

'కథ వెనుక కథ' టైటిల్.. ఫస్ట్ లుక్ లాంచ్

విశ్వంత్ దుద్దుంపూడి శ్రీజిత ఘోష్‌, శుభ శ్రీ హీరో హీరోయిన్లుగా సాయి స్రవంతి మూవీస్ సమర్పణలో దండమూడి బాక్సాఫీస్, సాయి స్ర‌వంతి మూవీస్