సుప్రీమ్ ట్రైల‌ర్ సూప‌ర్..

  • IndiaGlitz, [Friday,April 15 2016]

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా ప‌టాస్ ఫేం అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన చిత్రం సుప్రీమ్. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. స‌మ్మ‌ర్ లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సుప్రీమ్ రెడీ అవుతుంది. సుప్రీమ్ ఆడియో ఫంక్ష‌న్ లో ట్రైల‌ర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే..సుప్రీమ్ ఎంట‌ర్ టైన్మెంట్ తో అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ మ‌న‌సులు దోచుకోవ‌డం ఖాయం అనిపిస్తుంది.

టాక్సీ డ్రైవ‌ర్ గా సాయిధ‌ర‌మ్ తేజ్ ను చూస్తే...గ్యాంగ్ లీడ‌ర్ లో చిరంజీవి గుర్తుకువ‌స్తున్నారు. హీరోయిన్ రాశీ ఖ‌న్నా వెరైటీగా పోలీస్ పాత్ర‌లో కామెడీ చేస్తుంది. డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి...ఈ చిత్రంలో రాశీ ఖ‌న్నాహీరోయిన్ కాదు క‌మెడియ‌న్ అని చెప్పారంటే రాశీ ఎంత‌గా కామెడీ చేస్తుందో అర్ధం చేసుకోవ‌చ్చు. సాయి కార్తీక్ రీమిక్స్ సాంగ్ కి ఇచ్చిన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌భాస్ శ్రీను ల కామెడీ ప‌టాస్ స్ధాయిలో అల‌రిస్తుంది అనిపిస్తుంది. మొత్తానికి ఈ ట్రైల‌ర్ చూస్తుంటే సుప్రీమ్ ఈ స‌మ్మ‌ర్ లో వ‌చ్చే హిట్ మూవీ అనిపిస్తుంది. మ‌రి..సుప్రీమ్ ఏరేంజ్ స‌క్సెస్ సాధిస్తాడో చూడాలి.